IPL Media Rights: రికార్డ్ బ్రేక్ చేసిన ఐపీఎల్, ప్రపంచంలోనే రెండో లీగ్‌గా

రెండ్రోజుల పాటు ముంబైలో జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్‌వర్క్‌తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్‌వర్క్‌ గెలిచింది.

IPL Media Rights: రికార్డ్ బ్రేక్ చేసిన ఐపీఎల్, ప్రపంచంలోనే రెండో లీగ్‌గా

Ipl

IPL Media Rights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అధిక ధనిక దేశీవాలీ లీగ్ గా పేరు దక్కించుకుంది. ఇదే కాక ఇప్పుడు మరో రికార్డ్ బ్రేక్ చేసింది. యూఎస్ఏ నిర్వహించే నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) తర్వాతి విలువ ఐపీఎల్ దే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ను వెనక్కు నెట్టింది. ఈపీఎల్‌ లో ఒక్కో మ్యాచ్ ప్రసార హక్కుల విలువ రూ.85కోట్లు కాగా, ఐపీఎల్ లో ఆ విలువ రూ.118.02కోట్లు.

రెండ్రోజుల పాటు ముంబైలో జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్‌వర్క్‌తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్‌వర్క్‌ గెలిచింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్‌ రూ.23వేల 575 కోట్లకు దక్కించుకుంది.

అంటే ఒక్కో మ్యాచ్‌కు రైట్ హోల్డర్లు బీసీసీఐకు రూ.118.02కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎలా అంటే ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్ లో 74మ్యాచ్ లు నడుస్తున్నాయి కాబట్టి. అలా చూస్తే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచ్ లు జరుగుతాయి.

ఐపీఎల్‌ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌‌కు చెందిన ‘వయాకామ్‌–18’, టైమ్స్‌ ఇంటర్నెట్‌ సంస్థలు 23వేల 773 కోట్లకు సొంతం చేసుకున్నాయి. టీవీ ప్రసార హక్కులను మాత్రం స్టార్ నెట్‌వర్క్‌ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్‌లో స్టార్ నెట్‌వర్క్ తొలిసారి ఐపీఎల్‌ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది.

Read Also: ఐపీఎల్ వేలంలోనే కారును కూడా అమ్మకానికి పెట్టిన టాటా

ఐపీఎల్ 2023-27 సీజన్‌ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48వేల 390.52 కోట్ల భారీ ఆదాయం లభించింది.

ఇక ఈ ప్రసార హక్కుల వేలంలో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్‌, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడ్డాయి.