sprouted peas : మొలకెత్తిన పెసలు తినటం ఆరోగ్యానికి మంచిదా?..

మొలకెత్తిన పెసలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. వివాహితులు మొలకెత్తిన పెసర్లను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. శరీర లోపలి భాగాలను శక్తివంతం చేస్తుంది.

sprouted peas : మొలకెత్తిన పెసలు తినటం ఆరోగ్యానికి మంచిదా?..

Green Gram

sprouted peas : భారతీయుల ఇష్టమైన ఆహారంగా పెసలను చెప్పవచ్చు. విటమిన్లు , పోషకాలు అధికంగా కలిగిన పెసలను మన పూర్వికులు అధికంగా వినియోగించేవారు. మూంగ్ దాల్ గా వీటిని స్నాక్ ఐటమ్ వినియోగిస్తారు. కూరల్లో పెసలు వాడతారు. రుచికరంగా ఉండే పెసర దోశలను తినేందుకు చాలా మంది ఇష్టపడతారు..పెసలను నీటిలో నానబెట్టి తరువాత వాటిని మొలకెత్తించి తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. మొలకెత్తిన పెసర గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పెసర మొలకలను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తిని పెరుగుతుంది. మన శరీరానికి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పెసర గింజలలో అధికభాగం ఫైబర్ ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ రేటు మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ తో భాధపడుతున్నవారు మొలకెత్తిన పెసలను తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొలకెత్తిన పెసర్లు చాలా మంచిది. సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. మొలకెత్తిన పెసలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే మొలకెత్తిన పెసర్లు చాలా ముఖ్యం. ప్రతిరోజు గుప్పెడు తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మొలకెత్తిన పెసలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. వివాహితులు మొలకెత్తిన పెసర్లను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. శరీర లోపలి భాగాలను శక్తివంతం చేస్తుంది. మొలకెత్తిన పెసర్లు గర్భిణీలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో మహిళల శరీరానికి ఫోలేట్ అవసరం. ఇది తల్లి కడుపు లోపల బిడ్డను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రోజూ మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చు. మొలకెత్తిన పెసర్లు బరువ తగ్గడానికి తోడ్పడుతాయి. శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కాకుడా చూస్తుంది. దీని కారణంగా అధిక ఆహారాన్ని తినలేము. బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరానికి కావాల్సిన విటమిన్ కె పెసర మొలకలను తీసుకోవటం ద్వారా లభిస్తుంది. రక్తం గడ్డ కట్టే ప్రక్రియకు విటమిన్ కె అవసరం.

పెసర మొలకల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కప్పు పెసర మొలకల ద్వారా 14 మిల్లీ గ్రాముల విటమిన్ సి శరీరానికి అందుతుంది. రోగనిరోధక శక్తిని పెంచటానికి ఎంతగానో దోహదపడతాయి. ఇందులో ఉండే అమైనో అమ్లాలలో గ్లోబులిన్, అల్బుమిన్ అనే ముఖ్యమైన ప్రొటీన్లు 85శాతానికి పైగా ఉంటాయి. కణజాలాలను నిర్మించటానికి , మరమత్తు చేయటానికి ఈ ప్రొటీన్ చాలా ముఖ్యం.