Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి....

Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?

Is Ram Charan Next Movie Going Back

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకోవడంతో, తన నెక్ట్స్ మూవీని కూడా చరణ్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మరోసారి శంకర్ మార్క్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అభిమానులను కలవర పెడుతోంది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీని తొలుత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్‌ను కూడా శరవేగంగా జరుపుతూ స్పీడు మీదున్నారు చిత్ర యూనిట్.

Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్..

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వేసవి 2023కి మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా డెవలెప్‌మెంట్స్‌ను బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషిల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, ఎస్.జె.సూర్య, సురేష్ గోపీ, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు వంటి భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.