Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు...

Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?

Ram Charan Next Movie Also With Tamil Director

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్..

ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ పాన్ ఇండియా మూవీగా తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే చర్చ కూడా అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

Ram Charan : భక్తితో శివలింగాన్ని కడుగుతున్న చరణ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..

అయితే చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఓ తమిళ డైరెక్టర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో విక్రమ్ అనే యాక్షన్ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్న లోకేశ్ కనగరాజ్, గతంలోనే చరణ్‌కు ఓ కథను నెరేట్ చేశాడని తెలుస్తోంది. అయితే ఆ కథకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, విక్రమ్ తరువాత లోకేశ్-చరణ్ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.