Suriya: ఈటి దెబ్బతో సూర్యకు ఓటీటీలే దిక్కా?

స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ వంటి స్టార్స్ తరువాత ఆ రేంజ్‌లో తెలుగులో ఫాలోయింగ్ ఉన్న హీరో ఖచ్చితంగా సూర్యనే.

Suriya: ఈటి దెబ్బతో సూర్యకు ఓటీటీలే దిక్కా?

Is Suriya Fit For Only Ott

Suriya: స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ వంటి స్టార్స్ తరువాత ఆ రేంజ్‌లో తెలుగులో ఫాలోయింగ్ ఉన్న హీరో ఖచ్చితంగా సూర్యనే. అయితే ఈ మధ్యకాలంలో సూర్య నటించే ప్రతి సినిమా కూడా తెలుగునాట పెద్దగా ఆదరణ పొందలేకపోతుంది. దీంతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా సూర్య నటించిన తాజా చిత్రం ‘ఈటి’ మార్చి 10న రిలీజ్ అయ్యి డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Boyapati-Suriya: టాలీవుడ్‌కు తమిళ హీరోలు.. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా?

అయితే ఈ సినిమాపై మొదట్నుండీ కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్ ఈ చిత్ర టైటిల్ అనే చెప్పాలి. సూర్య సినిమాలకు ఆడియెన్స్ మంచి టైటిల్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఈసారి కేవలం ఈటి అనే సాదాసీదా టైటిల్‌తో సూర్య జనం ముందుకు రావడంతో వారు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. అటు ఈ సినిమా సబ్జెక్ట్ కూడా కొత్తగా లేకపోవడం, రొటీన్ కమర్షియల్ అంశాలతోనే ఈ సినిమా రావడంతో రిలీజ్ రోజునే ప్రేక్షకులు ఈ చిత్రానికి దూరంగా ఉన్నారు.

కాగా ఈటి చిత్రం తెలుగునాట రాంగ్ టైమ్‌లో రిలీజ్ అయ్యిందనే వాదన కూడా వినిపిస్తుంది. అసలు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ రాధేశ్యామ్ మార్చి 11న భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న తరుణంలో, సూర్య ఓ రొటీన్ కథను పట్టుకొచ్చి జనం మీదకు వదలడం ఏమిటని వారు కామెంట్ చేస్తున్నారు. ఇక సూర్య ఈటి చిత్రం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. తన గత సినిమాలు ‘ఆకాశమే నీ హద్దురా..’, ‘జై భీమ్’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి అదిరిపోయే సక్సెస్ అందుకున్న సూర్య, ఇప్పుడు ఓ సాధారణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని మాత్రం థియేటర్లలో రిలీజ్ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా ఈటి సినిమాకు వచ్చిన రిజల్ట్‌ను చూస్తే.. మున్ముందు సూర్య తన సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక సూర్య తన సినిమాలపై నమ్మకం ఉంటేనే థియేటర్లలో రిలీజ్ చేయాలని, సినిమాలో ఎలాంటి కొత్తదనం, కంటెంట్‌లో దమ్ము లేకపోతే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసుకోవడం బెటర్ అని పలువురు ఆయనకు సూచిస్తున్నారు. మరి నిజంగానే ఈటి దెబ్బకు సూర్య ఇకపై కేవలం ఓటీటీలకే పరిమితమవుతాడా అనేది చూడాలి.