Sun Cooling Down: చల్లారిపోతున్న సూర్యుడు?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇండియన్ సైంటిస్టులు

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు 1996 నుండి 2007 వరకు సూర్యుడు 2008 నుంచి 2019 మధ్య కాలంలో స్థిరంగా ఉన్నాడని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది.

Sun Cooling Down: చల్లారిపోతున్న సూర్యుడు?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇండియన్ సైంటిస్టులు

Sunny Intensity High Telangana

Updated On : December 20, 2021 / 8:24 AM IST

Sun Cooling Down: నెల క్రితం నాసా ఓ విషయం చెప్పింది. సూర్యుడు కొత్త సౌర చక్రంలోకి ప్రవేశించిన సమయంలో సౌర మండలంలోని మంటలు చాలా చురుకుగా ఉన్నాయని వెల్లడించింది. దానికి విరుద్ధంగా, భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు 1996 నుండి 2007 వరకు సూర్యుడు 2008 నుంచి 2019 మధ్య కాలంలో స్థిరంగా ఉన్నాడని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది. 2008-2019 మధ్య కాలంలో సూర్యుని నుంచి కరోనల్ మాస్ బహిర్గతాలు గణనీయంగా తగ్గాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తల అధ్యయనంలో మరిన్ని విషయాలు తెలిశాయి.

ఖగోళ శాస్త్రవేత్తలు ఫ్రంటియర్స్ ఇన్ ఆస్ట్రానమీ & స్పేస్ సైన్స్‌లో ప్రచురించిన రీసెర్చ్ పేపర్‌లో కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు, వాటి ఇంటర్‌ప్లానెటరీ కౌంటర్‌పార్ట్ (ICMEలు) విస్తరణ ప్రవర్తనను వివరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సూర్యునిపై అయస్కాంత చర్య దాదాపు 11-సంవత్సరాల కాలంలో హెచ్చుతగ్గులకు గురైంది. దీనిని మూడు దశలుగా విభజించారు.

………………………………. : తెలంగాణలో నిన్న కొత్తగా 134 కోవిడ్ కేసులు…