TS Covid Update : తెలంగాణలో నిన్న కొత్తగా 134 కోవిడ్ కేసులు…

తెలంగాణలో నిన్నకొత్తగా 134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

TS Covid Update : తెలంగాణలో నిన్న కొత్తగా 134 కోవిడ్ కేసులు…

Ts Covid Update

TS Covid Update :  తెలంగాణలో నిన్నకొత్తగా 134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,79,564కి చేరింది. వీరిలో 6,71,856మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో, రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.86 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ నిన్న విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది.

మరో వైపు, గడచిన 24 గంటల్లో ఒకరు మరణించటంతో ఇప్పటి వరకు కోవిడ్, సంబంధిత ఇతర సమస్యలటి మరణించిన వారి సంఖ్య 4,015కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,693 క్రియాశీల కేసులు ఉన్నాయి ఇలా ఉండగా, GHMC పరిధిలో కొత్తగా 82 కోవిడ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 9, సిధ్దిపేట జిల్లాలో 6 మందికి, హన్మకొండ జిల్లాలో 5 మందికి కోవిడ్ సోకినట్లు కొత్తగా నిర్ధారణ అయింది.

Also Read : Hyderabad : యువతిపై దాడి చేసిన మాజీ ప్రియుడు

తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరిగుతోంది…. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసుల సంఖ్య 20కి చేరింది.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.