thyroid : థైరాయిడ్ సమస్య ప్రమాదకరమేనా?…
అవసరానికి మించి హార్మోన్ ఉత్పత్తి కావటాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇది వచ్చిన వారిలో నీరసం, త్వరగా అలసి పోవటం, ఒంటి నొప్పులు, అతి నిద్ర, ఉబకాయం, బరువు పెరగటం, ముఖం,శరీరం వాపు, చర్మం పొడిబారటం, జుట్టు రాలిపోవటం, మలబద్ధకం, గుండె దడ, చేతులు వణకటం, చిరాకు, కోపం, వంటి సమస్యలు కనిపిస్తాయి.

Thyroid
thyroid : బి.పి, షుగర్ వ్యాధుల లాగానే థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, అయోడిన్ లోపం, పలు రకాల మందుల వాడకం, అధిక ఒత్తిడి, ప్రసవం తర్వాత హార్మోన్లలో వచ్చే మార్పులు, శరీరంలో పోషకాల కొరత ఇలా రకరకాల కారణాల థైరాయిడ్ బారిన పడుతుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ఒక్క సారి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది. మరియు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇటీవలికాలంలో థైరాయిడ్ సంబంధిత వ్యాదులు పెరుగుతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మనిషి గొంతు కింది భాగంలో వాయునాళం వద్ద సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంధినే థైరాయిడ్ అంటాం. ఇది శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గంథ్రిలో కణితులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతాయి.
అవసరానికి మించి హార్మోన్ ఉత్పత్తి కావటాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇది వచ్చిన వారిలో నీరసం, త్వరగా అలసి పోవటం, ఒంటి నొప్పులు, అతి నిద్ర, ఉబకాయం, బరువు పెరగటం, ముఖం,శరీరం వాపు, చర్మం పొడిబారటం, జుట్టు రాలిపోవటం, మలబద్ధకం, గుండె దడ, చేతులు వణకటం, చిరాకు, కోపం, వంటి సమస్యలు కనిపిస్తాయి.
అయితే చాలా మంది థైరాయిడ్‌ను ప్రమాదకరమైన సమస్యగా పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. నిర్లక్ష్యం చేసే కొద్దీ థైరాయిడ్ వ్యాధి ప్రమాదకరంగా మారిపోతుంది. దీనికి సరైన చికిత్స పొందని పక్షంలో గుండె పోటు, నరాలు బలహీనంగా మారిపోవడం వంటి సమస్యలు వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే థైరాయిడ్ సమస్య ఉందని తెలిసి వెంటనే చికిత్స తీసుకోవాలి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు వైద్యుని సలహాతో వైద్యసహాయం పొందాలి. వారు సూచించిన విధంగా .. రోజూ మందులు వేసుకుంటూనే డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్లు, బ్రెజిల్ నట్స్, అవిసె గింజలు, పెరుగు, చేపలు, తాజా పండ్లు, కూరగాయలు, మనగాకు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి మంచి ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకొలీ, ముల్లంగి, చిలగడదుంప, పాలకూర, కేల్, సోయా బీన్స్, పీచ్, అవకాడో వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ థైరాయిడ్ వ్యాధి బాధితులు మాత్రం వీటిని తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, వీటిలో గాయిటరోజెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ను మరింత తీవ్ర తరం చేస్తుంది.
మందులతో పాటు సరియైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను నియంత్రించవచ్చు. మన ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మందుల ప్రభావంతో థైరాయిడ్ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది.