Ishant Sharma : నీ సైజ్‌కు త‌గ్గ షార్ట్స్ కొనుక్కో.. కోహ్లిని తొలిసారి క‌లిసిన‌ప్పుడు..

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ఇషాంత్ శ‌ర్మ‌(Ishant Sharma), ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి(Virat Kohli ) ఇద్ద‌రూ మంచి స్నేహితులు అన్న సంగ‌తి చాలా మందికి తెలిసిందే.

Ishant Sharma : నీ సైజ్‌కు త‌గ్గ షార్ట్స్ కొనుక్కో.. కోహ్లిని తొలిసారి క‌లిసిన‌ప్పుడు..

Ishant Sharma-Virat Kohli

Ishant Sharma-Virat Kohli : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ఇషాంత్ శ‌ర్మ‌(Ishant Sharma), ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి(Virat Kohli ) ఇద్ద‌రూ మంచి స్నేహితులు అన్న సంగ‌తి చాలా మందికి తెలిసిందే. వీరిద్దరు క‌లిసి ఢిల్లీ జ‌ట్టుకు, టీమ్ఇండియాకు క‌లిసి ఆడారు. కాగా.. విరాట్‌ను మొద‌టి సారి క‌లిసిన‌ప్పుడు జ‌రిగిన ఓ స‌ర‌దా సంఘ‌ట‌న‌ను తాజాగా ఇషాంత్ శ‌ర్మ షేర్ చేసుకున్నాడు.

విరాట్‌, నేను మొద‌టి సారిగా అండ‌ర్‌-17 ఢిల్లీ ట్ర‌య‌ల్స్ వెళ్లాము. అయితే.. అప్ప‌టికే విరాట్ అండ‌ర్‌-19కు ఆడ‌డంతో అత‌డి పేరు చాలా మందికి తెలుసు. అంద‌రూ అత‌డిని వీరు అని పిలిచేవారు. నాకు, విరాట్‌కు మ‌ధ్య వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో ఓ మ్యాచ్ జ‌రిగింది. అత‌డు నా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. అది పూర్తిగా ప్లాట్ పిచ్ కావ‌డంతో నేను ఎక్కువ‌గా ఏమీ చేయ‌లేక‌పోయాను. ఎలాగోలా నేను అండ‌ర్‌-17 ట్ర‌య‌ల్స్‌కు ఎంపిక అయ్యాను.

CWC Qualifier 2023 : వెస్టిండీస్‌కు వ‌రుస షాక్‌లు.. జింబాబ్వే చేతిలో ఓట‌మి.. ఐసీసీ జ‌రిమానా

ఆ సమ‌యంలో కోహ్లిని క‌లిశాను. అప్పుడు నేను చిన్న సైజ్ ఉన్న షార్ట్స్ ధ‌రించాను. అది చూసిన విరాట్ సోదరా, కనీసం మీ సైజుకు త‌గ్గ షార్ట్స్ కొనుక్కో అన్నాడు. నేను అప్పుడు చాలా సిగ్గుప‌డేవాడిని ఎవ్వ‌రితో ఎక్కువ‌గా మాట్లాడేవాడిని కాదు. దీంతో కోహ్లి అన్న‌దానికి ఎలా రియాక్ట్ కావాలో నాకు అప్పుడు అర్థం కాలేదు. అని ఇషాంత్ అన్నాడు.

ICC World Cup 2023 : ఐసీసీ కీల‌క అప్‌డేట్‌.. ఆగ‌స్ట్ 29 డెడ్ లైన్‌.. దేనికంటే..?

చిన్న వ‌య‌సులోనే కోహ్లికి ఆట పై ఎంతో ప‌రిజ్ఞానం ఉంద‌ని ఇషాంత్ చెప్పాడు. రివ‌ర్స్ స్వింగ్ ఎలా రాబ‌ట్టాలో కోహ్లికి బాగా తెలుసున‌న్నాడు. ఓ సారి మేము ఎస్ఎఫ్ బంతితో ఆడాడు. ఆ బంతితో ఎలా రివ‌ర్స్ సింగ్స్ రాబ‌ట్టాడో అత‌డు నాకు చెప్పాడు. నేను ఆ మ్యాచ్‌లో 13 వికెట్లు తీశాను. ఆ త‌రువాత మేమిద్దం మంచి స్నేహితులం అయ్యాము అంటూ ఇషాత్ అప్ప‌టి సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నాడు.