Presidential polls: ఇదొక‌ గొప్ప యుద్ధం: య‌శ్వంత్ సిన్హా

దేశంలోని విప‌క్ష పార్టీలు ఐక్యంగా క‌లిసి వ‌చ్చి త‌న‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నిల‌బెట్టినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు. విప‌క్ష పార్టీల‌ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌న ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Presidential polls: ఇదొక‌ గొప్ప యుద్ధం: య‌శ్వంత్ సిన్హా

Yashwanth

Presidential polls: దేశంలోని విప‌క్ష పార్టీలు ఐక్యంగా క‌లిసి వ‌చ్చి త‌న‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నిల‌బెట్టినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు. విప‌క్ష పార్టీల‌ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌న ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విప‌క్ష పార్టీల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో నాలుగో స్థానంలో తాను ఉన్నాన‌ని అన్నార‌ని, అయితే, తాను 10వ స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ ఒప్పుకునేవాడిన‌ని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రప‌తి ప‌ద‌వికి పోటీ చేయ‌డం ఓ గొప్ప యుద్ధ‌మ‌ని ఆయ‌న అన్నారు.

presidential election: నామినేష‌న్ వేసిన య‌శ్వంత్ సిన్హా.. పోటీ రెండు భావ‌జాలాల‌క‌న్న రాహుల్

కాగా, ఈ సంద‌ర్భంగా తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగ‌త్ రాయ్ మాట్లాడుతూ… రాష్ట్రప‌తి ప‌ద‌వికి పోటీ చేయ‌డానికి య‌శ్వంత్ సిన్హా స‌రైన అభ్య‌ర్థి అని అన్నారు. ఆయ‌న గ‌తంలో చాలా కాలం పాటు ప్ర‌భుత్వ అధికారిగా ప‌నిచేయ‌డంతో పాటు కేంద్ర మంత్రిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించార‌ని చెప్పారు. రాష్ట్రప‌తి ఎన్నిక పోటీ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న పోరు కాద‌ని అన్నారు. ఇది రెండు భావ‌జాలాల‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న పోటీ అని చెప్పారు. మ‌త‌త‌త్వానికి-లౌకిక‌వాదానికి, నిరంకుశ‌త్వానికి-ప్ర‌జాస్వామ్యానికి మ‌ధ్య ఈ పోటీ జ‌రుగుతోంద‌ని చెప్పుకొచ్చారు.