Sharwanand: జై బాలయ్య.. లక్ష్య ప్రీ రిలీజ్ వేడుకలో శర్వా కామెంట్స్!

కరోనా తర్వాత థియేటర్ కి వచ్చి ప్రేక్షకులు సినిమా చూస్తారా లేదా అన్న అనుమానాలను నటసింహం బాలయ్య ఒక్క దెబ్బతో పటాపంచెలు చేస్తూ థియేటర్లు దద్దరిల్లేలా అఖండ విజయాన్ని అందుకున్నాడు.

Sharwanand: జై బాలయ్య.. లక్ష్య ప్రీ రిలీజ్ వేడుకలో శర్వా కామెంట్స్!

Sharwanand: కరోనా తర్వాత థియేటర్ కి వచ్చి ప్రేక్షకులు సినిమా చూస్తారా లేదా అన్న అనుమానాలను నటసింహం బాలయ్య ఒక్క దెబ్బతో పటాపంచెలు చేస్తూ థియేటర్లు దద్దరిల్లేలా అఖండ విజయాన్ని అందుకున్నాడు. ఇటు ప్రేక్షకులే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం బాలయ్య మాస్ మానియాకు ఫిదా అయిపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్, యంగ్ హీరోలలో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు బాలయ్య అఖండ విజయంపై ట్విట్టర్ వేదికగా జై బాలయ్య అంటూ అఖండ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.

Vishnu Priya: గుండెలు తీసిన రాణి ఈ విష్ణు ప్రియా!

కాగా, మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇప్పుడు జై బాలయ్య అంటూ అఖండ విజయాన్ని సినిమా విజయంగా పేర్కొన్నాడు. నాగ శౌర్య హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్య సినిమా తెరకెక్కింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

ProjectK: అచ్చ తెలుగు సంప్రదాయంలో దీపికాకు గ్రాండ్ వెల్‌కమ్

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన శర్వానంద్ ముందుగా, జై బాలయ్య అంటూ మాట్లాడడం మొదలు పెట్టాడు. అఖండ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన శర్వానంద్.. పుల్లెల గోపీచంద్ గారితో స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నానని తెలిపాడు. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ.. ఆ వేడుకకు రావడానికి ముఖ్య కారణం, నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ అని.. లవ్ స్టోరీతో పెద్ద హిట్ ఇచ్చిన ఈ నిర్మాతలు నాగ శౌర్యకి కూడా పెద్ద హిట్ ఇస్తున్నారని ధీమా వ్యక్తం చేశాడు.