Janasena : తెలంగాణ నుండి పోసానిని బహిష్కరించాలి : జనసేన మహిళ విభాగం

జనసేన మహిళ విభాగం పోసాని కృష్ణ మీద ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి చేరుకుంది. పవన్ పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.

Janasena : తెలంగాణ నుండి పోసానిని బహిష్కరించాలి : జనసేన మహిళ విభాగం

Janasena

Janasena women’s wing : జనసేన మహిళ విభాగం పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీపీకి ఫిర్యాదు చేయడానికి వచ్చామని తెలిపారు. మహిళలపై పోసాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి పోసాని కృష్ణ ను బహిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. నిన్న ప్రెస్ క్లబ్ లో మహిళలను టార్గెట్ చేసి పోసాని మాట్లాడారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో ఆడవారిని దూషించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా పోసాని గురించి మాట్లాడలేదని చెప్పారు. తాము ఎక్కడ పోసాని మీద దాడి చెయ్యలేదన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కోనసాగిస్తామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ అటు పరిశ్రమలోనూ, ఇటు రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. దీనిపై వైసీపీ వాళ్లు జనసేన వాళ్ళు ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. దీనిపై పరిశ్రమలో కూడా విమర్శలు వస్తున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని అధికారికంగానే ప్రకటించింది. దీనిపై నిన్న పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని దారుణంగా విమర్శించారు.
ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసానిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక పోసాని ఫోన్ కి కొన్ని వేల మెసేజ్ లు పంపిస్తున్నారు. అత్యంత దారుణంగా తిడుతూ పోసానికి మెసేజ్ లు ఫోన్లు వచ్చాయి. దీంతో నిన్న మళ్ళీ పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు.

Posani Krishnamurali : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది: పోసాని

ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తనను రాత్రిపూట ఫోన్ చేసి మరీ తిట్టారని, తనను సినిమాలోంచి తీసేశారని తెలిపారు. తను సినిమా షూటింగ్ కి టైంకి ఉంటానని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పని చేస్తానని ఇండస్ట్రీ అందరికి తెలుసన్నారు. అయినా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో రాత్రి టైం షూట్ ఉందని చెప్తే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అని ఒప్పుకొని వెళ్ళానని గుర్తు చేశారు. రాత్రి 7 నుంచి 9 వరకు షూట్ అని చెప్పారు తాను టైంకి వెళ్ళినట్లు తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ రాలేదని చెప్పారు. 9 గంటల వరకు వెయిట్ చేసి చేసి కో డైరెక్టర్ కి చెప్పి మరీ వెళ్ళిపోయానని తెలిపారు.

తాను వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ లొకేషన్ కి వచ్చి తాను లేనని తెలిసి తనకు డైరెక్ట్ గా ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా షూటింగ్ ఉందని చెప్పినా ఎలా వెళ్ళిపోతావు అని పిచ్చి తిట్లు తిట్టాడని వాపోయారు. తాను ఏం జరిగిందో చెప్పానని పేర్కొన్నారు. అవునా సారీ అని చెప్పి ఫోన్ కట్ చేసి తనను సినిమాలోంచి తీసేయమని డైరెక్టర్ కి చెప్పాడని గుర్తు చేశారు. కో డైరెక్టర్ ని కూడా తీసేసారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అలాంటి వాడని… పవన్ కళ్యాణ్ కి తన మీద కోపం ఉందన్నారు. అందుకే ఆయన ఫ్యాన్స్ తో ఇలా బూతులు తిట్టిస్తున్నాడని వాపోయారు. ఇలా ఫోన్స్ చూపిస్తున్నాడని పోసాని విరుచుకుపడ్డారు.