Jio Phone 5G : ఇండియాకు జియో ఫోన్ 5G వచ్చేస్తోంది.. BIS సర్టిఫికేషన్ ఇదిగో.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Jio Phone 5G : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. భారత మార్కెట్లోకి త్వరలో సరికొత్త జియో 5G ఫోన్ (Jio Phone 5G) లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను పొందింది.

Jio Phone 5G : ఇండియాకు జియో ఫోన్ 5G వచ్చేస్తోంది.. BIS సర్టిఫికేషన్ ఇదిగో.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Jio Phone 5G gets BIS certification, likely to arrive in India soon

Jio Phone 5G : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. భారత మార్కెట్లోకి త్వరలో సరికొత్త జియో 5G ఫోన్ (Jio Phone 5G) లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను పొందింది. ఈ డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించిన కొద్ది రోజులకే BIS సర్టిఫికేషన్ అనుమతులను పొందింది.

రాబోయే జియో 5G ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే రిలయన్స్ AGM ఈవెంట్‌లో మాత్రమే జియో సరికొత్త జియో ఫోన్‌ (Jio Phone)ను లాంచ్ చేస్తుందని భావించవచ్చు. RIL ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జియో ఫోన్ గురించి ఇప్పటికే ధృవీకరించారు. ఈ ఏడాది ఆగస్టులో 5G-రెడీ జియో ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

జియో 5G డివైజ్‌ కోసం గూగుల్‌తో కలిసి పని చేస్తోందని అంబానీ తెలిపారు. త్వరలో లాంచ్‌పై మరింత స్పష్టత రానుంది. 5G ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ డివైజ్ అధికారిక పేరు ఏమిటో ప్రస్తుతానికి తెలియదన్నారు. జియో దీనికి జియో ఫోన్ 5G అని పేరు పెట్టనున్నట్లు లీక్ డేటా పేర్కొంది. ప్రస్తుతం గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ Jio LS1654QB5తో లిస్టు అయింది.

Jio Phone 5G gets BIS certification, likely to arrive in India soon

Jio Phone 5G gets BIS certification, likely to arrive in India soon

Read Also : Jio 5G Phone Launch : రిలయన్స్ జియో 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

బడ్జెట్ ఫోన్ 4GB RAMతో రావచ్చని లిస్టు సూచిస్తుంది. Qualcommతో కంపెనీ భాగస్వామ్యాన్ని అంబానీ ఇప్పటికే ధృవీకరించారు. Jio ఫోన్ 5G స్నాప్‌డ్రాగన్ చిప్‌ను ప్యాక్ చేస్తుందని ఆశించవచ్చు. స్నాప్‌డ్రాగన్ 480+ SoC ద్వారా పనిచేస్తుంది. లిస్టింగ్ ప్రకారం.. జియో ఫోన్ 5G Android 12 OS తో రావొచ్చు. మరోవైపు.. గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ 13ని లాంచ్ చేసింది.

జియో 5G ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..

జియో ఫోన్ 5G 6.5-అంగుళాల HD+ LCD 90Hz స్క్రీన్, 5,000mAh బ్యాటరీ, 13-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని లీక్‌లు పేర్కొన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP సెన్సార్ ఉండవచ్చు. కనీసం 18W ఛార్జింగ్‌కు కంపెనీ సపోర్ట్‌ను అందిస్తుందని చెప్పవచ్చు. కొన్ని నెలల క్రితమే టెలికాం కంపెనీ జియో ఫోన్ కోసం పనిచేస్తోందని హింట్ ఇచ్చింది.

వచ్చే ఏడాది ఎప్పుడైనా జియో 5G ఫోన్ లాంచ్ కావొచ్చు. రిలయన్స్ తదుపరి AGM ఈవెంట్‌లో జరిగే అవకాశం ఉంది. జియో ఫోన్ ధర రూ. 8వేల నుంచి రూ.10వేల మధ్య ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. కచ్చితమైన ధర పరిధి ఇంకా వెల్లడి కాలేదు. హ్యాండ్‌సెట్ ధర రూ.15వేల లోపు ఉండే అవకాశాలు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్లాగ్‌షిప్ సిరీస్ వస్తోంది.. 8K వీడియో రికార్డింగ్ సపోర్టు, మరెన్నో ఫీచర్లు..