Job Notification : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో ఉద్యోగాల భర్తీ

కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టిక్ ఇంజనీరింగ్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. గేట్-2021 క్వాలిఫై అయిన అభ్యర్ధులు మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Job Notification : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో ఉద్యోగాల భర్తీ

Job Notification 2021

Job Notification : కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గేట్-2021లో వచ్చిన స్కోరు అధారంగా ఇంజనీర్లు, ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ల నియామకం చేపట్టనుంది. గేట్ స్కోర్ ప్రాతిపదికన ముందుగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్టు లో ఉన్న అభ్యర్ధులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ టాక్స్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభకనబరిచిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు. నియామక ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే నిర్వహిస్తారు.

కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టిక్ ఇంజనీరింగ్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. గేట్-2021 క్వాలిఫై అయిన అభ్యర్ధులు మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గతంలో గేట్ లో అర్హత సాధించినప్పటికీ ఆ స్కోర్ ను పరిగణలోకి తీసుకోరు. అభ్యర్ధులు జులై 26వ తేది లోపు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ధరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఒకసారి ఆన్ లైన్లో ధరఖాస్తు సబ్ మిట్ చేశాక ఎలాంటి మార్పులు చేర్పులు అనుమతించరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వడ్ కేటగిరి అభ్యర్ధులు వారి కేటగిరి సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.