Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాక్.. ‘జైన ఫుడ్’ ఇచ్చేందుకు నిరాకరణ

మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు జైలులో జైన మతానికి చెందిన ప్రత్యేక ఆహారం అందించేందుకు కోర్టు నిరాకరించింది.

Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాక్.. ‘జైన ఫుడ్’ ఇచ్చేందుకు నిరాకరణ

Satyendar Jain: జైలులో రాచమర్యాదలు అనుభవిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రత్యేకంగా జైన ఫుడ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 2017 మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ మంత్రి అయిన సత్యేంద్ర జైన్‌ను గత మే 31న సీబీఐ అరెస్టు చేసింది.

Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక!

అప్పటి నుంచి ఆయన ఢిల్లీ, తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, జైన మతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన తనకు జైలులో ప్రత్యేక ఫుడ్ అందేలా చూడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా జైలు అధికారులపై ఆరోపణలు కూడా చేశాడు. జైలులో తనకు సరైన ఆహారం అందించడం లేదన్నారు. వండిన ఆహారం, పప్పు ధాన్యాలు, పాలు, పండ్లు వంటి పోషకాహారం ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపాడు. జైన మతానికి చెందిన తాను ఆ మతాన్ని బాగా ఫాలో అవుతానని, అందువల్ల జైలులో తన కోసం ప్రత్యేకంగా జైన ఆహారం అందించాలని కోర్టును కోరాడు. దీనిపై జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం వాళ్లకైనా ఒక రకమైన ఆహారం అందిస్తామని, అందరికీ పోషకాహారం ఇస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు సత్యేంద్రకు జైన ఆహారం అందించేందుకు నిరాకరించింది. ఈ విషయంపై అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని చెప్పింది. కాగా, జైలులో సత్యేంద్ర జైన్ సకల సౌకర్యాలు అనుభవిస్తున్న వీడియోలు ఇటీవల విడుదలై సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అత్యాచార నిందితుడు సత్యేంద్రకు మసాజ్ చేస్తున్న వీడియో, ప్రత్యేక ఆహారం తీసుకుంటున్న వీడియో విడుదలయ్యాయి.