WTC Final 2023: ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నుంచి స్టార్ పేసర్ ఔట్
మరో రెండు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కీలక సమయంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.

Josh Hazlewood-Michael Neser
WTC Final 2023-Josh Hazlewood : మరో రెండు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు మ్యాచ్ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. అయితే.. ఈ కీలక సమయంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
గాయం కారణంగా ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్ వుడ్(Josh Hazlewood) ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి కాలి మడకు గాయం అయ్యింది. ప్రస్తుతం హేజిల్‌వుడ్ వేగంగా కోలుకుంటున్నాడని, అయితే.. యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని అతడికి మరింత రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆసీస్ ఛీప్ సెలక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. హేజిల్‌వుడ్ స్థానంలో మైఖేల్ నేసర్(Michael Neser)ను జట్టులోకి తీసుకున్నారు.
నేసర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్నాడు. గ్లామోర్గన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. 19 వికెట్లు తీయడంతో పాటు 311 పరుగులు చేశాడు. అతడి ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే జట్టులోకి తీసుకున్నట్లు ఆసీస్ సెలక్టర్లు తెలిపారు.
డబ్ల్యూటీసీకి ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెస్ఫి, మైఖేల్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచ్ మార్ష్, మాథ్యూ రెన్‌షా