NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

తాజాగా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఉదయమే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించి..................

NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
ad

NTR :  ఇవాళ మే 28న తెలుగు వారి యుగపురుషుడు, మహా నేత, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ని నిన్న రాత్రే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

F3 సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా??

తాజాగా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఉదయమే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించి నివాళులర్పించారు. ఆ మహనీయుడని తలుచుకున్నారు. ఉదయం నుంచే రద్దీ ఉండటంతో వచ్చి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు ఈ హీరోలిద్దరూ. ఇక అభిమానులు కూడా ఉదయం నుంచే ఎన్టీఆర్ ఘాట్ కి క్యూ కట్టారు. ఈ సారి శత జయంతి కావడంతో మరింతమంది ఎన్టీఆర్ ఘాట్ కి విచ్చేస్తున్నారు.