హ్యాట్సాఫ్ సైనికా :మెకాల్లోతు మంచులో గ‌ర్భ‌ణిని ఆస్పత్రికి మోసుకెళ్ళిన జ‌వాన్లు

హ్యాట్సాఫ్ సైనికా :మెకాల్లోతు మంచులో గ‌ర్భ‌ణిని ఆస్పత్రికి మోసుకెళ్ళిన జ‌వాన్లు

Jummu Kashmir: Army help pregnant woman reach hospital : దేశం కోసం ప్రాణాలు పెట్టే సైనికులు దేశ ప్రజలకు ఆపదొస్తే మేమున్నామంటున్నారు. దేశ సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడమే కాదు..ప్రజలకు కష్టమొస్తే మా సేవల్ని అందిస్తామంటున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ సంఘ‌ట‌న. ఓ గర్భిణీకి నెలలు నిండడంతో పురిటినొప్పలు ప్రారంభమయ్యాయి.

ఓ వైపు హిమపాతం. మోకాలు లోతు పేరుకుపోయిన మంచు. నడవటమే కష్టం అయిన వాతావరణం. అటువంటి పరిస్థితుల్లో ఆ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. మంచు బాగా కురవడంతో భారీగా పేరుకుపోయిన మంచుతో వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఆమెను జవాన్లు తమ భుజాలమీద ఆస్పత్రికి మోసుకెళ్లిన ఘటన మన సైనికుల పెద్ద మనస్సుకు నిదర్శనం.

జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని కరల్​పురాలో ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణీకి సాయం చేసేందుకు సైనికులు ముందుకొచ్చారు. గర్భిణిని ఓ మంచంపై మోసుకెళ్లి 3.5 కిమీ దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు.

అనంతరం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. జననరి 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మోకాళ్ల లోతు మంచులో గర్భిణీని సైనికులు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్త తెలిసాక అందరూ ‘హ్యాట్సాఫ్ సైనికా’..అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.హిమపాతంలోనూ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు సైనికులు చూపించిన ధైర్యసాహసాలను ప్రతిఒక్కరూ అభినందిస్తూ..ప్రశంసిస్తున్నారు.

కాగా..మంగళవారం రాత్రి 11.30గంటల సమయంలో కరాల్ పురా లోని ఇండియన్ ఆర్మీ చెందిన ఆపరేటింగ్ బేస్ (సిఓబీ) ఫార్కియన్ గ్రామంలో నివసిస్తున్న మంజూర్ అహ్మద్ షేక్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన భార్య ప్రసవ నొప్పులతో బాధపడుతోందని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఆందోళనపడుతూ షేక్ తెలిపారు.

దీంతో వెంటనే కదిలిన ఆర్మీ సదరు గర్భిణిని మంచంపై జాగ్రత్తగా పడుకోబెట్టి తమ భుజాలమీద మోస్తూ..3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ లో చేర్పించగా ఆమె పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా..కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు నిరంతరం హిమపాతం కురుస్తూనే ఉంది. ఈ మంచు చాలా ప్రాంతాలు నిరోధించారు.