Chief Justice Chandrachud : నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం

భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు.

Chief Justice Chandrachud : నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం

Justice Dhananjaya Yashwant Chandrachud

Chief Justice Chandrachud : భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ యూయూ లలిత్ రిటైరైన సంగతి తెలిసిందే. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.

అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్చితి తదితర కేసులలో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ చారిత్రక తీర్పులు ఇచ్చాడు. 2016 మే 13వ తేదీన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు కంటే ముందు అలహాబాద్, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుగా పని చేశారు. 1998-2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు.ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వంటి కీలక తీర్పులిచ్చారు.

Justice DY Chandrachud: భారత నూతన న్యాయమూర్తిగా నియామకమైన జస్టిస్ చంద్రచూడ్ గురించి 5 కీలక విషయాలు

జస్టిస్ చంద్రచూడ్ తండ్రి వై వి. చంద్రచూడ్ గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత సుదీర్ఘకాలం పని చేశారు. ఆయన 16వ సీజేఐగా ఫిబ్రవరి 2,1978 నుంచి జూలై 11,1985 వ‌ర‌కు కొనసాగారు. ఇప్పటికే డి.వై.చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా మారిన నేపథ్యంలో ఇంకెలాంటి కీలక తీర్పులు ఇస్తారో చూడాలి మరి.