Kalyan Ram: కీలక షెడ్యూల్‌ను ముగించేసిన కళ్యాణ్ రామ్ ‘డెవిల్’!

నందమూరి కళ్యాణ్ రామ్ ఈఏడాదిలో ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో, తన నెక్ట్స్ మూవీని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ రామ్.

Kalyan Ram: కీలక షెడ్యూల్‌ను ముగించేసిన కళ్యాణ్ రామ్ ‘డెవిల్’!

Kalyan Ram Completes Key Schedule Of Devil Movie

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ ఈఏడాదిలో ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో, తన నెక్ట్స్ మూవీని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ రామ్.

Kalyan Ram : స్పీడ్ పెంచేసిన కళ్యాణ్ రామ్.. తమిళనాడులో ‘డెవిల్’..

‘డెవిల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరయడ్ డ్రామాగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను దర్శకుడు నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ చాలా కొత్తగా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌ను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, తాజాగా ఈ షెడ్యూల్ షూటింగ్ ముగిసినట్లు కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ తెలిపింది.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.