Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్!

టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకడు. ఈ హీరో ఇటీవల లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘‘కళ్యాణం కమనీయం’’ అంటూ వస్తున్నాడు ఈ హీరో.

Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్!

Kalyanam Kamaneeyam Movie Reaches Break Even Before Release

Kalyanam Kamaneeyam: టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకడు. ఈ హీరో ఇటీవల లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘‘కళ్యాణం కమనీయం’’ అంటూ వస్తున్నాడు ఈ హీరో.

Kalyanam Kamaneeyam: స్వీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణం కమనీయం ట్రైలర్.. పండగ బరిలో మరోకటి!

ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. కాగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను మినిమం బడ్జెట్‌తో రూపొందించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూపంలో ఇప్పటికే రూ.7 కోట్లు వసూలైనట్లుగా తెలుస్తోంది.

దీంతో ఈ సినిమాకు పెట్టిన పూర్తి బడ్జెట్ ఇప్పటికే రికవర్ అయ్యిందని.. ఇక థియేటర్లలో ఈ సినిమా వసూలు చేసేది మొత్తం లాభాలే అని నిర్మాతలు అంటున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అందాల భామ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, అనిల్ కుమార్ ఆళ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.