Kalyanam Kamaneeyam: స్వీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణం కమనీయం ట్రైలర్.. పండగ బరిలో మరోకటి!

టాలీవుడ్‌లో వరుసగా రొమాంటిక్, ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కిస్తుండగా, ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి రిలీజ్ చేసింది.

Kalyanam Kamaneeyam: స్వీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణం కమనీయం ట్రైలర్.. పండగ బరిలో మరోకటి!

Kalyanam Kamaneeyam Trailer Filled With Romance

Kalyanam Kamaneeyam: టాలీవుడ్‌లో వరుసగా రొమాంటిక్, ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కిస్తుండగా, ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి రిలీజ్ చేసింది.

Santosh Shoban : మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు.. దటీజ్ డార్లింగ్..

ఈ ట్రైలర్ ఆద్యంతం రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్‌గా కట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా కథను ఈ ట్రైలర్‌లోనే చూపెట్టారు. ఉద్యోగం చేసే భార్య.. సపోర్ట్ చేసే మామ.. ఖాళీగా ఉండే భర్త.. చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. అయితే తన భర్త ఉద్యోగం చేయాలని ఆ భార్య కోరుకోవడం.. అదే విషయంలో పంతం వీడకపోవడంతో, ఆ భర్త ఆమె కోసం ఎలాంటి పాట్లు పడ్డాడు. అతడు తన భార్య కోరినట్లుగా ఉద్యోగం చేశాడా.. లేక వేరే ఏదైనా పని చేస్తాడా.. ఈ క్రమంలో వారిమధ్య ఏర్పడే మనస్పర్థలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి.. చివరకు వారిద్దరు మళ్లీ ఎలా కలుసుకుంటారు అనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

దర్శకుడు అనిల్ కుమార్ ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతంగా ఉండబోతుందని.. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కంప్లీట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుభూతిని మిగిలిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. జనవరి 14న కళ్యాణం కమనీయం చిత్రాన్ని రిలీజ్ చేయనుండగా, ఈ సినిమాను యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.