Santosh Shoban : మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు.. దటీజ్ డార్లింగ్..

దర్శకుడు శోభన్ తనయుడు, టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్ హీరోగా నిలదొక్కుకోవడానికి డార్లింగ్ ప్రభాస్ తన వంతు సాయమందిస్తున్నారు..

Santosh Shoban : మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు.. దటీజ్ డార్లింగ్..

Santosh Shoban: సినిమా ఇండస్ట్రీలో తాటికాయ అంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎదగడం అంటే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విషయంలో జరిగిన మ్యాజిక్ రిపీట్ కావడం అనేది సుసాధ్యం అనే చెప్పాలి. అదే మంచి టాలెంట్ ఉన్న యాక్టర్‌కి చక్కటి సపోర్ట్ తోడైతే ఇక ఆ రేంజ్ వేరేలా ఉంటుంది.

Prem Kumar : సంతోష్ శోభన్ హీరోగా ‘ప్రేమ్ కుమార్’

ఇప్పుడలాంటి సపోర్టే రెబల్ స్టార్ ప్రభాస్.. యంగ్ హీరో సంతోష్ శోభన్‌కి చేస్తున్నారు. అతనికి సపోర్ట్ చెయ్యడం తన బాధ్యత అని కూడా అంటున్నారు. అసలు ప్రభాస్‌కి సంతోష్‌కి రిలేషన్ ఏంటి?.. డార్లింగ్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయిన ‘వర్షం’ సినిమా డైరెక్టర్ శోభన్, సంతోష్ శోభన్ తండ్రి.

Varsham

శోభన్ రచయిత – దర్శకుడిగా అతి తక్కువ టైం లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వర్షం’, ‘బాబీ’, రవితేజ ‘చంటి’ సినిమాలు డైరెక్ట్ చేశారు. ‘ఒకరాజు ఒక రాణి’ లో యాక్ట్ చేశారు. ‘మురారి’ సినిమాకు డైలాగ్స్ రాశారు. ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి స్వయానా శోభన్‌కి అన్నయ్య. 2008లో శోభన్ గుండెపోటుతో మరణించారు. తర్వాత కొద్ది రోజులకు లక్ష్మీపతి కూడా కన్నుమూశారు.

Sobhan

Oka Raju Oka Rani

తండ్రి డైరెక్టర్, పెదనాన్న యాక్టర్ కావడంతో సంతోష్‌కి చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండేది. సుమంత్ హీరోగా వచ్చిన ‘గోల్కొండ హైస్కూల్’ లో నటించి ఫస్ట్ సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ‘తను నేను’ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ‘పేపర్ బోయ్’ సినిమాతో కుర్రాడిలో విషయం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

Prem Kumar : సంతోష్ శోభన్ హీరోగా ‘ప్రేమ్ కుమార్’

శోభన్ తనయుడు హీరోగా పరిచయమవుతున్న క్రమంలో త్రివిక్రమ్, ప్రభాస్, రామ్ చరణ్‌లతో పాటు ఆయనతో రిలేషన్ ఉన్న పలువురు ప్రముఖులు తమ వంతుగా సంతోష్ హీరోగా నటించిన సినిమాలను ప్రమోట్ చేశారు. ప్రభాస్ హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ లో తన పర్ఫార్మెన్స్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.

Prabhas – Ram Charan : స్నేహితుల సినిమాకు ప్రభాస్ – రామ్ చరణ్ సపోర్ట్..

మంచి ఫిజిక్, హైట్, నటన, డ్యాన్స్‌లో వైవిధ్యం చూపించాలనే ఆసక్తి, బేస్ వాయిస్.. ఇలా సంతోష్‌లో చాలా క్వాలిటీస్ ఉండడం.. పైగా ప్రభాస్ లాంటి స్టార్ సపోర్ట్ చేస్తుండడంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. యూవీ క్రియేషన్స్‌లో, మారుతి డైరెక్షన్లో ‘మంచి రోజులు వచ్చాయి’, అభిషేక్ మహర్షి దర్శకత్వంలో ‘ప్రేమ్ కుమార్’, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా ‘శ్రీదేవి శోభన్ బాబు’, నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఇక నీకు.. అన్నీ మంచి శకునములే’.. ఇలా అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

Anni Manchi Sakunamule

అలాగే తెలుగు ఓటీటీ ‘ఆహా’, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘ది బేకర్ & ది బ్యూటీ’ అనే వెబ్ సిరీస్‌‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు సంతోష్ శోభన్. ఈ సిరీస్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

The Baker And The Beauty : ‘ఆహా’ లో మరో డిఫరెంట్ ఒరిజినల్