Kamal Haasan : ప్రాజెక్ట్ K లో విలన్ రోల్ ఒప్పుకోవడానికి కారణం అదే.. కామిక్ కాన్ ఈవెంట్‌లో కమల్..
ప్రభాస్ కల్కిలో కమల్ హాసన్ విలన్ రోల్ చేయడానికి గల కారణాన్ని కామిక్ కాన్ ఈవెంట్‌లో తెలియజేశాడు.

Kamal Haasan reveals why he choose villain role in Project K
Kamal Haasan : ప్రభాస్ (Prabhas) హీరోగా, కమల్ హాసన్ విలన్ గా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. ఈ మూవీకి అందరూ అనుకున్నట్లే కల్కి (Kalki 2898 AD) అని టైటిల్ నే ఖరారు చేశారు. ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం మూవీ టీం అంతా అక్కడి ఆడియన్స్ అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో కమల్ ఈ సినిమాకి ఎందుకు ఒకే చెప్పడానికి రీజన్ చెప్పాడు.
Kamal – Amitabh : హాలీవుడ్ స్టేజి పై కమల్ హాసన్‌కి అమితాబ్ కౌంటర్.. వీడియో వైరల్!
“ఒక హీరో పుట్టాలి అంటే విలన్ తప్పకుండా ఉండాలి. సినిమాలో హీరో రోల్ ఎంత ముఖ్యమో విలన్ రోల్ కూడా అంతే ముఖ్యం అని నేను నమ్ముతాను” అందుకే ఈ సినిమాని కమల్ ఒకే చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కమల్ హాసన్ ఎక్కడ కనిపించలేదు. ఈ విషయం గురించి రానా.. మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ప్రశ్నించగా, అతడు బదులిస్తూ.. ‘గ్లింప్స్ మొత్తం ఆయన ఉన్నాడు కానీ అది మీకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Kamal Haasan : అమితాబ్ బచ్చన్ నటించిన ఆ సినిమా, నిర్మాతలపై నాకెంతో ద్వేషం కలిగింది..
కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని.. వంటి టాప్ బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కలియుగాంతం చివర్లో ఈ సినిమా కథ మొదలు కాబోతుంది. 2898 AD లో ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు విష్ణుమూర్తి 10వ అవతారం కల్కి ఉద్భవించి ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది సినిమా కథ అని గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది.