Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.. ప్రభాస్‌తో కమల్ హాసన్? కమల్ గెస్ట్ రోల్..
తాజాగా ప్రాజెక్ట్ K సినిమా గురించి మరో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ని ఓ గెస్ట్ రోల్ కి అడుగుతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Kamal Haasan will be a guest role in Project K Movie team wants to approach kamal
Project K : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని.. ఇలా బాలీవుడ్ స్టార్స్, మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ని ఓ గెస్ట్ రోల్ కి అడుగుతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ప్రాజెక్ట్ K టీం అనుకుంటున్నారు కానీ ఇంకా కమల్ ని అప్రోచ్ అవ్వలేదని సమాచారం. ఒక 10 నిమిషాల గెస్ట్ రోల్ కోసం కమల్ హాసన్ ని అనుకుంటున్నారు ప్రాజెక్ట్ K టీం. మరి వీళ్ళు కమల్ ని అప్రోచ్ అయితే కమల్ ఒప్పుకుంటారా లేదా చూడాలి.
Dhanush : ముంబైలో ధనుష్.. ఇలా మారిపోయాడేంటి.. వైరల్ అవుతున్న ధనుష్ కొత్త లుక్..
ఒకవేళ ఇది నిజమై కమల్ హాసన్ ప్రాజెక్ట్ K లో నటించేందుకు ఒప్పుకుంటే, ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా ఉన్నారు సినిమాలో. దీంతో సినిమాకి మరింత హైప్ వస్తుంది అని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రాజెక్ట్ K యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు.