Jailer : సూపర్ స్టార్‌కి తోడు మరో స్టార్ హీరో.. ‘జైలర్’తో వెండితెరపై విధ్వంసమే..
రజనీకాంత్.. ఆ స్టైల్, ఎనర్జీని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు. సెవెన్టీస్ లో ఉన్నా ఆ స్పీడ్, యాక్షన్, అగ్రెషన్ చూడడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్. ఇటీవల రకరకాల సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న రజనీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని................

Kannada star hero shiva rajkumar plays villain role to opposite rajinikanth in jailar movie
Jailer : రజనీకాంత్.. ఆ స్టైల్, ఎనర్జీని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు. సెవెన్టీస్ లో ఉన్నా ఆ స్పీడ్, యాక్షన్, అగ్రెషన్ చూడడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్. ఇటీవల రకరకాల సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న రజనీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. మరి రజనీ సినిమాలో మరో స్టార్ హీరో కూడా తోడైతే ఇక ఆ ఆసినిమా వేరే లెవెల్ లో ఉంటుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈమధ్య సినిమాల స్పీడ్ తగ్గించిన రజనీకాంత్ లేట్ అయినా లేటెస్ట్ గా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ లో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. ఇప్పుటికే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తుంది. నరసింహ సినిమాతో వీళ్ళిద్దరూ సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో ఇప్పుటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రజనీకి విలన్ గా పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జైలర్ సినిమాలో సాలిడ్ ఫైట్స్ తో స్టైలిష్ యాక్షన్ చేస్తున్నారు రజనీకాంత్. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ లేటెస్ట్ షెడ్యూల్ లో శివరాజ్ కుమార్ జాయిన్ అయ్యారు. రజనీ, శివరాజ్ కుమార్ లతో స్టైలిష్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. చిత్ర యూనిట్ అధికారికంగా జైలర్ సెట్స్ నుంచి శివన్న ఫోటోని విడుదల చేశారు.
నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న జైలర్ కి సంబందించి శివరాజ్ కుమార్ రజనీకాంత్ కాంబినేషన్ సీన్స్ 4,5 రోజుల్లో కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ శివరాజ్ కుమార్ ఫ్యామిలీ రజనీకాంత్ తో క్లోజ్ రిలేషన్ ఉండడంతో పాటు తన ఫేవరెట్ యాక్టర్ అయిన రజనీతో స్క్రీన్ షేర్ చేస్కోవడంతో ఆనందపడిపోతున్నారు శివరాజ్ కుమార్. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఇక ఆ సినిమా వెండితెరపై విధ్వంసం గ్యారెంటీ అంటున్నారు అభిమానులు. రజినీకి అన్ని చోట్లా మార్కెట్ ఉంది. ఇక శివరాజ్ కుమార్ కూడా తోడవడంతో కన్నడతో పాటు బయట కూడా జైలర్ సినిమాకి మార్కెట్ మరింత పెరగనుంది. దీంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుందని ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారు.
On the sets of #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @sunpictures pic.twitter.com/ByvOOhjjek
— DrShivaRajkumar (@NimmaShivanna) November 17, 2022