Upendra : ఉపేంద్ర సరికొత్త బిజినెస్.. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు రెంట్‌కి తన ఫామ్‌హౌస్..

ఉపేంద్రకు బెంగుళూరు అవుట్‌కట్స్ లో ఒక మంచి భారీ ఫామ్ హౌస్ ఉంది. అప్పుడప్పుడు మాత్రమే ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని వాడతారు. మిగిలిన సమయాల్లో ఇది ఖాళీగానే ఉంటుంది. దీన్ని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాడు.

Upendra : ఉపేంద్ర సరికొత్త బిజినెస్.. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు రెంట్‌కి తన ఫామ్‌హౌస్..

Kannada Star Hero Upendra give his farmhouse to marriages and parties on rental basis

Upendra New Business : కన్నడ(Kannada) స్టార్ హీరో ఉపేంద్ర తన డిఫరెంట్ సినిమాలతో కన్నడలోనే కాక తెలుగులో కూడా అభిమానులని సంపాదించుకున్నారు. ఇటీవలే కబ్జ(Kabzaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమా పరాజయం పాలైంది. త్వరలో మరిన్ని డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు ఉపేంద్ర. మన సెలబ్రిటీలు సినిమాలతో పాటలు రకరకాల బిజినెస్ లు చేస్తారని తెలిసిందే. అయితే ఉపేంద్ర సరికొత్తగా ఆలోచించి ఓ బిజినెస్ మొదలుపెట్టాడు.

ఉపేంద్రకు బెంగుళూరు అవుట్‌కట్స్ లో ఒక మంచి భారీ ఫామ్ హౌస్ ఉంది. అప్పుడప్పుడు మాత్రమే ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని వాడతారు. మిగిలిన సమయాల్లో ఇది ఖాళీగానే ఉంటుంది. దీన్ని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాడు. తాజాగా ఈ ఫామ్ హౌస్ కి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేసాడు ఉపేంద్ర.

తన ఫామ్ హౌస్ వీడియో షేర్ చేస్తూ.. మా ఫామ్ హౌస్ ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. బెంగళూరులోని మైసూర్ రోడ్డులో పెద్ద మర్రి చెట్టు దగ్గర ఈ ఫామ్ హౌస్ ఉంది. నాలుగు ఎకరాల్లో చుట్టూ పచ్చని గ్రీనరీతో ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఎంగేజ్‌మెంట్స్, పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు లాంటి ప్రత్యేకమైన వేడుకలకు నా ఫామ్ హౌస్ అద్భుతంగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఈ నంబర్ కి కాల్ చేయండి అంటూ ఓ నంబర్ ని షేర్ చేశాడు ఉపేంద్ర.

Bro Movie : అభిమానుల ఫొటోలతో ‘బ్రో’ కటౌట్లు.. పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఆఫర్..

ఇక ఈ ఫామ్ హౌస్ దాదాపు నాలుగు ఎకరాల్లో ఉంది. ఇందులో పెద్దగా పదివేల చదరపు అడుగుల హాల్, బార్, 6 విలాసవంతమైన బెడ్ రూమ్స్, పెద్ద టెర్రస్, పదివేల చదరపు అడుగుల ఖాళీ స్థలం, నాలుగు గదులు.. ఇలా చాలా సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఉపేంద్ర భలే ఆలోచించాడు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, పార్టీలకు ప్రస్తుతం ఇలాంటి వాటికి గిరాకీ ఉంది కాబట్టి బాగానే బిజినెస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఫామ్ హౌస్ ని రెంట్ కి ఎందుకు ఇస్తున్నారు? అది కూడా కమర్షియల్ గా? ఉపేంద్ర మనీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారా? అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతే ఏముంది ఐడియా మాత్రం బాగుంది, ఖాళీగా ఉండే ఫామ్ హౌస్ ని ఇలా రెంట్ కి ఇవ్వడం మంచి విషయమే కదా అంటున్నారు.