Chennakesava Temple: కర్ణాటకలో ఖురాన్ పఠనంతో ప్రారంభమైన చెన్నకేశవ రథయాత్ర

ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సంప్రదాయాన్ని కొనసాగించడానికే నిర్వాహకులు మొగ్గుచూపారు. దీంతో ఖురాన్ పఠనంతోనే చెన్నకేశవుడి రథోత్సవం మొదలైంది.

Chennakesava Temple: కర్ణాటకలో ఖురాన్ పఠనంతో ప్రారంభమైన చెన్నకేశవ రథయాత్ర

Chennakesava

Chennakesava Temple: కర్ణాటకలోని చెన్నకేశవ ఆలయంలో ఏటా నిర్వహించే రథోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సందర్శకులతో రథోత్సవం పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. కాగా రథోత్సవం ప్రారంభం సందర్భంగా ముస్లింలు సంప్రదాయ బద్ధంగా ఖురాన్ పఠనం చేపట్టారు. ముస్లిం మతగురువు ఖాజీ సయ్యద్ సజీద్ పాషా బుధవారం పండుగ ప్రారంభానికి ముందు ఖురాన్ శ్లోకాలను పఠించారు. అయితే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రథోత్సవంలో ఖురాన్ పఠనాన్ని నిలిపివేయాలని హిందూ సంఘాలు కోరారు. అయినప్పటికీ సంప్రదాయాన్ని కొనసాగించడానికే నిర్వాహకులు మొగ్గుచూపారు. దీంతో ఖురాన్ పఠనంతోనే చెన్నకేశవుడి రథోత్సవం మొదలైంది.

Also read:PMs Musesum : దేశ ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ.. ఫొటో గ్యాలరీ

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రథోత్సవం రెండు సంవత్సరాల పాటు నిర్వహించలేదు. మతాంతర సంబంధాలు, హిజాబ్ వివాదం, హలాల్ వివాదం, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపు వంటి అంశాలపై ఇటీవల కర్ణాటకలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలోనే..ఖురాన్ పఠనంతో చెన్నకేశవస్వామి రథయాత్ర యాత్ర ప్రారంభమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రథయాత్ర ప్రారంభం సందర్భంగా కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డీ రేవన్న స్పందిస్తూ “సంప్రదాయాలను అనుసరించే వారు వాటిని కొనసాగించాలని..రాష్ట్రంలోను, దేశంలోను ఉన్న హిందువులు, ముస్లిములు, క్రైస్తవులందరూ తమ ఐక్యతను కాపాడుకోవాలని..ఈ సంప్రదాయాలకు విఘాతం కలిగించకూడదని అన్నారు.

Also read:Covid in India : ఢిల్లీలో 24 గంటల్లో 50 శాతం పెరిగిన కొవిడ్ కేసులు..

పన్నెండవ శతాబ్దానికి చెందిన హొయసల రాజు విష్ణువర్ధనుడు 1116లో చోళులపై సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన దీనిని విజయ నారాయణగా నామకరణం చేశారు. ప్రస్తుతం చెన్నకేశవ స్వామి ఆలయంగా ప్రసిద్ధిపొందిన ఈ ఆలయం కర్ణాటక చరిత్రలోనే మైలురాయిగా మిగిలిపోయింది. దేశవిదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు మరియు భక్తులు చెన్నకేశవ స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు.

Also Read:CJI NV Ramana : వాఘా బోర్డ‌ర్‌ను సంద‌ర్శించిన తొలి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రికార్డు