PMs Musesum : దేశ ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ.. ఫొటో గ్యాలరీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి దేశానికి ప్రధానులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ మ్యూజియాన్ని ప్రారంభించిన సందర్భంగా స్వయంగా తొలి టికెట్ కొనుగోలుచేసి లోపలికి ప్రవేశించారు.

స్వాతంత్ర్య వచ్చిననాటి నుంచి దేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలు, వారి సేవలకు సంబంధించి వివరాలను ప్రధానమంత్రి సంగ్రహాలయంలో పొందుపర్చారు.

ఢిల్లీ తీన్‌మూర్తి మార్గ్‌లోని నెహ్రూ మ్యూజియంలో ఈ హైటెక్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

మాజీ ప్రధానుల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, ఘనతలను.. యువతరానికి తెలిపేలా చేయడమే దేశ ప్రధానులు మ్యూజియం ఉద్దేశం

సిద్ధాంతాలకు అతీతంగా ప్రధానుల సేవలకు గౌరవం ఇవ్వాలన్న మోడీ సంకల్పం మేరకు ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

పదవీకాలంతో సంబంధం లేకుండా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ప్రధానమంత్రి సంగ్రహాలయ టికెట్ ధరలు కూడా ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి సంగ్రహాలయ టికెట్ ధర ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

భారతీయులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో రూ. 110 అయితే విదేశీయులకు మాత్రం దీని ధర రూ. 750వరకూ ఉంటుంది.

ఐదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 50 శాతం రాయితీ ఇస్తారు.

కాలేజీ, హైస్కూల్ విద్యార్థులు బుకింగ్‌లపై 25 శాతం తగ్గింపు పొందొచ్చు.

ప్రధానుల మ్యూజియంలో మొత్తం 43గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

మ్యూజియం చిహ్నం జాతీయతను, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ధర్మచక్ర గుర్తును చేతులతో పట్టుకున్నట్లుగా లోగోను ఆవిష్కరించారు.

స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశాభివృద్ధి కోసం పలువురు ప్రధానులు ఎదుర్కొన్న సవాళ్లను ఇక్కడ పొందుపరిచారు.

ప్రధానుల నాయకత్వం, దార్శనికత, విజయాల గురించి యువ తరానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా మ్యూజియం ఏర్పాటు