ఫీజుల కోసం వేధింపులు..ఉరి వేసుకోబోయిన విద్యార్థికి విద్యాశాఖామంత్రి మోటివేషన్

ఫీజుల కోసం వేధింపులు..ఉరి వేసుకోబోయిన విద్యార్థికి విద్యాశాఖామంత్రి మోటివేషన్

education minister meets a boy who tried to suicide :  కర్ణాటకలో ఓ విద్యార్థి స్కూలు ఫీజులు కట్టలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫీజు వెంటనే కట్టాలని స్కూలు యాజమాన్యం గట్టిగా నిలదీయడం..అవమానకరంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి చెందిన 10h క్లాస్ విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖామంత్రి స్వయంగా ఆ విద్యార్ధి దగ్గరకొచ్చి హితోపదేశం చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటే నీ కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడతారో అర్థం చేసుకో..ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదంటూ..విద్యార్ధికి ఉపదేశాలు చేశారు.

బెంగళూరులోని సోమసుందర పాళ్య ప్రాంతంలోని ఓ స్కూల్లో ఓ బాలుడు 10h క్లాస్ చదువుతున్నాడు. లాక్ డౌన్ తరువాత రీ ఓపెన్ చేసిన స్కూల్ కు వెళ్లాడు. దీంతో లాక్ డౌన్ సమయంలో కూడా ఫీజులు కట్టాలని సదరు స్కూల్ యాజమాన్యం చెప్పింది. మాది పేద కుటుంబం..నేను అంత ఫీజు కట్టలేనని చెప్పి వాపోయాడు. దానికి స్కూల్ యాజమాన్యం ఒప్పుకోలేదు. సరికదా..ఆ విద్యార్ధిని తోటి విద్యార్థుల ముందు తీవ్రంగా దూషించింది. పరుష పదజలంతో దూషించింది. దాంతో మనస్తాపానికి గురైన బాలుడు మంగళవారం (జనవరి 9,2021) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకోవటంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటనపై కర్ణాటక సెకండరీ విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ కు తెలిసింది. దీంతో ఆయన వెంటనే ఆ బాలుడి నివాసానికి వెళ్లి మంచి మాటలతో అతడిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవటం ఎంత చెడ్డదో చెప్పుకొచ్చారు. “నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ తల్లిదండ్రులు..నీ తోడబుట్టినవారు ఎంత బాధపడతారో ఆలోచించావా? నిన్ను వాళ్లు మరచిపోగలరా?, నువ్వు చేసిన పని వాళ్లను ఎంత బాధిస్తుందో తెలుసా? జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూలతలనైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలి. ఆత్మహత్య పద్ధతులను ఎప్పుడూ చేయకూడదు” అని అతడిలో ధైర్యం నింపేయత్నాలు చేశారు.

ఈ సందర్భంగా మహేశ్ అనే విద్యార్థి ఎన్ని కష్టాలు పడి చదువులో రాణించాడో చెప్పుకొచ్చారు. మహేశ్ ఓ వలసకూలీ కొడుకు..గత సంవత్సరం 10h క్లాస్ పరీక్షల్లో మహేశ్ ఎంతో ప్రతిభ చూపాడని, దాంతో అతడి ఉన్నత చదువులకు సాయపడేందుకు ఎంతోమంది ముందుకొచ్చి చేయూతనిచ్చారని చెప్పారు. జీవితం అంటే కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి అంతేతప్ప అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు అనే విషయాన్ని గుర్తించాలి. కష్టాలు ఎదురయ్యానని ధైర్యంకోల్పోకూడదని హితవు పలికారు.

అలాగే సదరు బాధిత బాలుడ్ని ఫీజుల కోసం ఇబ్బంది పెట్టిన స్కూలు యాజమాన్యానికి కర్ణాటక విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది. విద్యార్దుల్ని ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏ విద్యార్ధినైనా ఫీజుల కోసం వేధిస్తే తమ దృష్టికి తీసుకురావలని సూచించింది.
– – – –
బీజింగ్: ప్రస్తుత మోడ్రన్ యుగంలో మనకు ఏం కావాలన్నా ఇంటికే వచ్చేస్తున్నాయి. హోం డెలివరీ అనేది అతి పెద్ద బిజినెస్ ఇండస్ట్రీగా ఎదుగుతోంది. ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా కూడా హోం డెలివరీ కంపెనీలకు కొంత లాభపడ్డాయనే చెప్పాలి. అయితే ఈ డెలివరీ వ్యవస్థను పగ తీర్చుకోవడానికి వాడుకుందో యువతి. తన ప్రియుడి పరువు తీసింది. ఈ ఘటన పొరుగు దేశం చైనాలో జరిగింది.

తన మాజీ ప్రియుడిపై కోపం వచ్చిన ఓ ప్రేయసి.. ఓ టీ షాపులో వేడి వేడి టీ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని తన బాయ్‌ఫ్రెండ్ వద్దకు తీసుకెళ్లి మొహాన కొట్టాలని డెలివరీ బాయ్‌కి చెప్పింది. ఈ వింత డిమాండ్‌ను స్వీకరించిన సదరు డెలివరీ బాయ్.. టీ తీసుకెళ్లి రోడ్డుపై ఉన్న బాయ్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న హోటల్ రిసీట్ అతని చేతిలో పెట్టాడు. దాన్ని అతను చూస్తుండగానే చేతిలోని టీ ఆ యువకుడి మొహాన కొట్టాడు. ఆ తర్వాత రిసీట్‌లో కస్టమర్ రిక్వెస్ట్ చూపించాడు. ఈ మొత్తాన్ని కొందరు కెమెరాలో బంధించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.