Bangalore Temple bell : గుడిలో గంటలు మోగించొద్దంటూ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు..నోటీసులు జారీ..!!
గుడిలో గంటలు మోగించొద్దంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు గంటలు మోగిస్తే ఊరుకునేది లేదంటూ నోటీసులు జారీ చేశారు.

Bangalore ‘dodda Ganapathi’ Temple Police Notice
Bangalore ‘Dodda ganapathi’ temple: గుడికి వెళితే ఠక్కున కొట్టేది గంట. గుడికి వెళ్లిన భక్తులు మొదట గంట మ్రోగించి ఆ తరువాతే దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. ఏ గుడిలో అయినా సరే జరిగేది ఇదే. కానీ గుడిలో గంటలు ఎక్కువగా మ్రోగుతున్నాయంటూ ఏకంగా పోలీసులు నోటీసులిచ్చిన వైనం బెంగళూరులో జరిగింది. గుడిలో గంటలు ఎక్కువగా మోగుతున్నాయని దీని వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతోందంటూ నోటీసులిచ్చారు పోలీసులు..!!
గుడి అన్నాక గంటలు మోగడం సహజం. ఏ గుడిలో అయినా ప్రసాదం పెట్టకపోవటం అంటూ ఉంటుందేమో గానీ గంటలు మోగని గుడి అంటూ ఉండదు. ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో గుడికి వచ్చిన భక్తులు గంట కొట్టి దణ్ణం పెట్టుకుంటారు. గుడిలో గంటల మోత చాలా శ్రావ్యంగా వినసొంపుగా ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు ఆలయ పూజారులకు, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో దొడ్డగణపతి ఆలయంలో భక్తులు తరచు కొడుతున్న గంటల వల్ల శబ్దకాలుష్యం పెరిగిపోతోందని.. గంటల శబ్దాన్ని పరిధిమేరకు అదుపులో ఉంచకపోతే శబ్దకాలుష్యచట్టం 2000, పర్యావరణ కాలుష్య చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆలయ పూజారులకు, యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. అక్కడితో ఊరుకోకుండా నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులు..పూజారులు ఆలయం అన్న తరువాత గంటల మోత మోగకుండా ఎలా ఉంటుందని పూజారులు ప్రశ్నిస్తున్నారు.
Also read : RGV : ఇంత అందంతో నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు.. యాంకర్ శ్యామల పై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..
బెంగళూరులో దొడ్డగణపతి ఆలయం అంటే తెలియని వారు ఉండరు. నగరంలోని ఈ దొడ్డగణపతి ఆలయం చాలా చాలా ఫేమస్ టెంపులు. ఈ దేవాలయానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోనే గణపతి ఆలయంతో పాటు ఆంజనేయ ఆలయం, దొడ్డ బసవన్న ఆలయం కూడా ఉన్నాయి. ఈ ఆలయం విశేషమం ఏమిటంటే..ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాదు కర్ణాటక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు.
దొడ్డ అంటే ‘పెద్ద’..పేరుకు తగినట్లే స్వామివారి విగ్రహం భారీగా..
కాగా.. కర్ణాటకలోని బెంగళూరులోని ఈ దొడ్డ గణపతి దేవాలయానికి చాలా చరిత్ర ఉంది. కన్నడంలో దొడ్డ అంటే ‘పెద్ద’ అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉంది. ఇది ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన గుడికి దగ్గరలో ఈ వినాయక ఆలయం ఉంది. ఈ దొడ్డగణపతి ఆలయాన్ని బెంగళూరు ను తీర్చిదిద్దిన కెంపెగౌడ నిర్మించారు.
ఆలయ చరిత్ర..
ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు కనిపించాయట. అందులో ఒక్కదాని మీద వినాయక ప్రతిమను చూసి, వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద విగ్రహాన్ని మలచమని ఆఙ్ఞాపించారట. అప్పుడు మలచిన గణపతినే ఈరోజు మనం చూస్తున్న దొడ్డ గణపతి. ఎక్కడ ఆలయం గోపురం, దేవాలయం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు దొడ్డ గణపతి ఆలయం, బసవన్న గుడిని దర్శించకుండా వెళ్ళరు. దేవాలయంలోని దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం.. 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు.
Also read : PM Modi..Ravidas : రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి..
బెంగళూరు ‘కరగ’ ఉత్సవ సంబరాలు..
ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే … ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాదు కర్ణాటక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు.
వెన్నతో స్వామి వారి అలంకరణ ప్రత్యేకం..
వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేస్తారు. రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు భావిస్తారు. వెన్న అలంకరణలో ఉన్న గణపతిని చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు. ఈతిబాధలన్నీ తీరిపోతాయని నమ్ముతారు.ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. అంటే విగ్రహం ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు.