PM Modi..Ravidas : రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి..

రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి చేశారు. కీర్తనలు ఆలపించారు.

PM Modi..Ravidas : రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి..

Pm Modi Offers Prayers To Sant Ravidas (1)

PM Modi offers prayers to Sant Ravidas : సిక్కు మతస్తుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ర‌విదాస్ 645వ జ‌యంతి సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని క‌రోల్ బాగ్‌లోని ర‌విదాస్ విశ్రామ్ ధామ్ మందిరానికి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి పూజలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న షాదాబ్ కీర్త‌న్‌లో పాల్గొన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ ఓ సాధారణ వ్యక్తిలాగా భక్తులతో కలిసి ఓ సంగీత పరికరం పట్టుకుని క‌చేరి చేశారు. కీర్త‌న‌ల‌ను ఆల‌పించారు.దీంతో అక్కడి భక్తులంతా ఎంతో సంబరపడిపోయారు.కాసేపు కచేరిలో పాల్గొన్న మోదీ వారికి నమస్కరించి అనంతరం అక్కడనుంచి పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది.

Also read : CM KCR : ఈనెల 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..గురువు రవిదాస్ స్ఫూర్తి ప్రతీ అడుగులో, ప్రతీ పథకంలో ఉందని ప్రధాని అన్నారు. కులం, అస్పృశ్య‌త నిర్మూల‌న‌కు ర‌విదాస్ కీల‌క‌పాత్ర పోషించారు. రవిదాస్ ఎంద‌రికో స్ఫూర్తిగా నిలుస్తార‌ని అన్నారు. గురు ర‌విదాస్ మాఘ పూర్ణిమా రోజున పుట్టారు. 1377వ సంవ‌త్స‌రంలో వార‌ణాసిలోని మందౌధి వ‌ద్ద ఆయ‌న జ‌న్మించారు. ర‌విదాస్ ఓ క‌వి, సామాజిక సంస్క‌ర్త‌, ఆధ్మాత్మిక గురువు. భ‌క్తి గీతాలు, కీర్త‌న‌లు, ఆధ్యాత్మిక బోధ‌న‌ల‌తో ఆయ‌న భ‌క్తి ఉద్య‌మాన్ని న‌డిపారు. సిక్కు మ‌తస్థుల ప‌విత్ర‌ గ్రంధం ఆది గ్రంథ్‌లో 40 ప‌ద్యాలు రాశారు.

Also read : Sansad TV YouTube : సంసద్ టీవీ అకౌంట్‌‌ను తొలగించిన యూట్యూబ్.. అందుకే టెర్మినేషన్..!

కాగా..పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 16నే జరగాల్సి ఉంది. గురువు రవిదాస్ జయంతి కావడంతో భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ సర్కారు కోరింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీకి పోలింగ్ ను వాయిదా వేసిందనే విషయం తెలిసిందే. రవిదాస్ జయంతి వేడులకు లక్షలాదిమంది సిక్కులు క‌రోల్ బాగ్‌లోని ర‌విదాస్ విశ్రామ్ ధామ్ మందిరానికి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి పూజలు నిర్వహిస్తుంటారు.