Omicron : భారత్‌‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..కర్నాటకలో రెండు కేసులు

2021, డిసెంబర్  02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Omicron : భారత్‌‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..కర్నాటకలో రెండు కేసులు

Indian Omicron Cases (1)

Karnataka Two Omicron Cases : అందరూ ఊహించినట్లే జరిగిపోయింది. భారత్ లోకి ఒమిక్రాన్ ఎంటర్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా…భారత్ లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021, డిసెంబర్  02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారికంగా ప్రకటించింది.

Read More : Whatsapp Accounts Ban : భారతీయ యూజర్లకు భారీ షాక్.. 20లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్!

46, 66 ఏళ్లు ఉన్న వ్యక్తులకు ఈ వేరియంట్ సోకిందని, ఇటీవలే విదేశాల నుంచి వీరు బెంగళూరుకు వచ్చారని, ప్రైమరీ కాంటాక్ట్స్ క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 29 దేశాల్లో 373 ఒమిక్రాన్ కేసులున్నట్లు నిర్ధారించారు. ఈ విషయంలో ప్రతొక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుందని తెలిపింది. ఒమిక్రాన్‌ భయాలతో భారత్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేరియంట్ తో భారత్ తో సహా..ప్రపంచ దేశాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read More : Ap Capital : 2022 మార్చి బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ ‘ఏపీ 3 రాజధానుల’ బిల్లు

కేరళ, మహారాష్ట్రలలో 55 శాతం కరోనా కేసులు ఉన్నాయని, ప్రజల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 జిల్లాల్లో 05 నుంచి 10 శాతం కరోనా పాజిటివ్, కేరళ, మహారాష్ట్రలో పది వేలకు పైగా కరోనా కేసులున్నాయని వెల్లడించింది. ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రెండో డోసు వ్యాక్సినేషన్ 11.7 శాతం పెరిగిందని అంచనా వేసింది. మరోవైపు..ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. 92 దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 84 దేశాల్లో వారానికి 5 శాతం కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.