Rahul Gandhi: మోదీ జీ.. ఇది సినిమా కాదు.. కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితులు: రాహుల్ గాంధీ
తమపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కశ్మీర్ పండిట్లు గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నారని, వీటిని పట్టించుకోకుండా బీజేపీ మాత్రం తమ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిందంటూ వేడుకలు చేసుకుంటోందని రాహుల్ అన్నారు. ‘‘ప్రధాన మంత్రి జీ.. ఇది సినిమా కాదు.. కశ్మీర్‌లోని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు’’ అని విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో టీచర్‌ను ఉగ్రవాదులు హత్య చేయడంతో పాటు కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. జమ్మూకశ్మీర్‌లో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు.
Tamil Nadu: ఉత్తర భారత్ విద్యార్థులు తమిళనాడులో కరోనా వ్యాపింపజేస్తున్నారు: తమిళనాడు మంత్రి
‘‘కశ్మీర్‌లో గత ఐదు నెలల్లో 15 మంది భద్రతా బలగాలు, 18 మంది మంది పౌరులను ఉగ్రవాదులు చంపేశారు. నిన్న కూడా ఓ టీచర్‌ను హత్య చేశారు. తమపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కశ్మీర్ పండిట్లు గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా బీజేపీ మాత్రం తమ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిందంటూ వేడుకలు చేసుకుంటోంది. ప్రధాన మంత్రి జీ.. ఇది సినిమా కాదు.. కశ్మీర్‌లోని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు ఇవి’’ అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.