Tamil Nadu: ఉత్త‌ర భార‌త్ విద్యార్థులు త‌మిళ‌నాడులో క‌రోనా వ్యాపింప‌జేస్తున్నారు: త‌మిళ‌నాడు మంత్రి

త‌మిళ‌నాడులో ఉత్త‌ర భార‌త్‌కు చెందిన విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాపింప‌జేస్తున్నారంటూ త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Tamil Nadu: ఉత్త‌ర భార‌త్ విద్యార్థులు త‌మిళ‌నాడులో క‌రోనా వ్యాపింప‌జేస్తున్నారు: త‌మిళ‌నాడు మంత్రి

Subrah Minister

Tamil Nadu: త‌మిళ‌నాడులో ఉత్త‌ర భార‌త్‌కు చెందిన విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాపింప‌జేస్తున్నారంటూ త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌రాది విద్యార్థుల వ‌ల్ల‌ కేళంబక్కం వీఐటీ కాలేజ్‌, స‌త్య‌సాయి కాలేజ్ విద్యార్థులకు హాస్ట‌ళ్లు, త‌ర‌గ‌ది గ‌దుల్లో క‌రోనా సోకింద‌ని ఆయ‌న చెప్పారు. ఉత్త‌ర భార‌త్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

Kejriwal: స‌త్యేందర్ జైన్‌ను చూసి దేశం గ‌ర్వించాలి.. ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలి: కేజ్రీవాల్

కాగా, త‌మిళ‌నాడులో కొత్తగా 98 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 34,55,474కు చేరింది. కాగా, తాజాగా కేళంబక్కం వీఐటీ కాలేజ్‌లో 2,943 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా వారిలో 118 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో క‌రోనా సోకిన‌ విద్యార్థుల‌ను ఐసోలేష‌న్ కేంద్రాల‌కు త‌ర‌లించారు. క‌రోనా కేసులు పెర‌గ‌డంతో ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది.