Revanth Reddy : ఓఆర్ఆర్ ను 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు అమ్మేసిన కేసీఆర్ : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో పెట్టుబడులకు, రాకపోకలకు అనువుగా ఉండేలా ఓఆర్ఆర్ వేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఓఆర్ఆర్ కీలకంగా మారిందన్నారు.

Revanth Reddy : ఓఆర్ఆర్ ను 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు అమ్మేసిన కేసీఆర్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy : తెలుగు దేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రపోజల్ పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓఆర్ఆర్ కు పునాదులు పడ్డాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 5వేల ఎకరాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఇలాంటి ఓఆర్ఆర్ సదుపాయాలు లేవని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో పెట్టుబడులకు, రాకపోకలకు అనువుగా ఉండేలా ఓఆర్ఆర్ వేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఓఆర్ఆర్ కీలకంగా మారిందన్నారు. ఈగల్ ఇన్ ఫ్రా సంస్థకు టోల్ వసూల్ కు ఇచ్చారని చెప్పారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ దోచి పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఓఆర్ఆర్ ను టోల్ వసూల్ వరకే కాకుండా దాని నిర్వహణను కూడా ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలని చూశారని పేర్కొన్నారు.

Revanth Reddy : 50లక్షల మంది జీవితాలతో చెలగాటం- కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

టీవోటీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు అమ్మేశారని వెల్లడించారు. కేసీఆర్ 30 ఏళ్లకు గంపగుత్తగా ఓఆర్ఆర్ ను అమ్మేశారని ఆరోపించారు. ప్రతి ఏటా రూ.700-800 కోట్లు వచ్చే ఓఆర్ఆర్ ను ప్రభుత్వం 30ఏళ్లకు అమ్మేసిందన్నారు. 30 ఏళ్లకు రూ.30 వేల కోట్లు వచ్చే అవకాశం ఉన్నా రూ.7,380 కోట్లకు అమ్మేశారని పేర్కొన్నారు.  ఆరు నెలల ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

అయితే, రాబోయే ప్రభుత్వం ఈ నిర్ణయంపై సమీక్ష చేస్తుందని చెప్పారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఇద్దరు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీని వెనుక రూ.1000 కోట్లు చేతులు మారాయని, పెద్ద కుంభకోణం ఉందన్నారు. దీన్ని కాంగ్రెస్ సహించబోదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.