KGF 2: ముందే రానున్న యష్.. ప్రభాస్‌తో పోటీ లేనట్లేనా?

సెకండ్ వేవ్ తో సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతుంటే.. బన్నీ మాత్రం ప్రీపోన్ చేసి తనకెవరూ అడ్డు లేకుండా చూసుకున్నారు. ఇదే రూట్ లోకి రాబోతున్నారు రాక్ స్టార్ యష్. ఎప్పుడో ఏప్రిల్ లో..

KGF 2: ముందే రానున్న యష్.. ప్రభాస్‌తో పోటీ లేనట్లేనా?

Kgg 2

KGF 2: సెకండ్ వేవ్ తో సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతుంటే.. బన్నీ మాత్రం ప్రీపోన్ చేసి తనకెవరూ అడ్డు లేకుండా చూసుకున్నారు. ఇదే రూట్ లోకి రాబోతున్నారు రాక్ స్టార్ యష్. ఎప్పుడో ఏప్రిల్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యష్ మనసు మార్చుకున్నారా..? తనకు అడ్డుగా ఉన్న ప్రభాస్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయ్ సినీ వర్గాలు.

Sai Dharam Tej: తేజ్ హెల్త్ ఒకే.. మరి షూటింగ్ ఎప్పుడు?

ఇండియన్ సినిమా మొత్తం కన్నడ సినిమా వైపు చూసేంత పెద్ద సక్సెస్ అయ్యింది కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రికార్డ్ సక్సెస్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది కేజీఎఫ్ 2. ఫస్ట్ పార్ట్ కి మించిన యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ప్యాచప్ పనుల్ని స్టార్ట్ చేసింది టీమ్. సడెన్ గా షూటింగ్ పనులు స్టార్ట్ చెయ్యడంతో కేజీఎఫ్ 2 ప్రీపోన్ అవుతోందన్న టాక్ నడుస్తోంది.

MAA Election: ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా.. ప్రలోభాలకు గురి కావద్దు!

కేజీఎఫ్ 2 సినిమాకు సంబందించి షూటింగ్ మొదలుపెట్టింది. సడెన్ కేజీఎఫ్ ప్యాచప్ పనులు స్టార్ట్ చెయ్యడంతో సినిమా ప్రీ పోన్ అవుతోందన్న రూమర్ వినిపిస్తోంది. ఈ మధ్య పుష్ప కూడా ఇలాగేప్రీ పోన్ అయ్యింది. క్రిస్ మస్ కి రిలీజ్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పుష్ప.. రిలీజ్ టైమ్ లో వేరే సినిమాలేం లేకుండా ప్లాన్ చేసుకుని వారం ముందుకొచ్చి డిసెంబర్ 17నే రిలీజ్ అవుతున్నాడు.

Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

పుష్ప రూట్లోనే యష్ కూడా వెళ్తున్నాడంటున్నారు జనాలు. ఎందుకంటే కేజీఎఫ్ 2 రిలీజ్, ప్రభాస్ సలార్ రిలీజ్ రెండూ ఏప్రిల్ 14నే. రెండు పెద్ద సినిమాలు క్లాష్ అయితే కలెక్షన్లు డ్రాప్ అవ్వడం గ్యారంటీ.. అందుకే రిలీజ్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన కేజీఎఫ్ 2 అసలు ప్రభాస్ తో పోటీ ఎందుకని.. పనుల్ని ముందే ఫినిష్ చేసుకుని రిలీజ్ ప్రీపోన్ చేసుకుంటోందని సౌత్ లో బాగా టాక్ వినిపిస్తోంది.