Sai Dharam Tej: తేజ్ హెల్త్ ఒకే.. మరి షూటింగ్ ఎప్పుడు?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుదుటపడుతుంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ వెళ్తున్న సాయిధరమ్ తేజ్ స్కిడ్ అయి భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే...

Sai Dharam Tej: తేజ్ హెల్త్ ఒకే.. మరి షూటింగ్ ఎప్పుడు?

Sai Dharam Tej

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుదుటపడుతుంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ వెళ్తున్న సాయిధరమ్ తేజ్ స్కిడ్ అయి భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాయిధరమ్ తేజ్ కి వారం రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్ మీదనే చికిత్స కొనసాగించారు. మొత్తానికి గాయాల నుండి పూర్తిగా కోలుకున్న తేజ్ తాజాగా థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

MAA Election: ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా.. ప్రలోభాలకు గురి కావద్దు!

దాదాపు నెలరోజుల తర్వాత తమ అభిమాన హీరో తిరిగి కోలుకొని త్వరలోనే తిరిగి కలుద్దాం అంటూ ఆసుపత్రి నుండే ట్వీట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే.. సర్జరీల వరకు వెళ్లిన ఈ ప్రమాదం నుండి తేజ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటారు.. ఎప్పుడు మళ్ళీ షూటింగ్ లో పాల్గొననున్నాడన్నది ఇప్పుడు మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, అభిమానులకు గుడ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. త్వరలోనే సాయిధరమ్ తేజ్ షూటింగ్ లో కూడా పాల్గొననున్నాడు.

Akhanda: యూనిట్ పార్టీ.. ప్రగ్యాతో బాలయ్య చిల్ అవుట్

తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈ మధ్యనే విడుదలై గుడ్ అప్లాజ్ దక్కించుకోగా.. కార్తీక్ వ‌ర్మ దండు అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ చిత్రాన్ని సుకుమార్‌, బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రాబోతున్న చిత్ర షూటింగ్ లో న‌వంబ‌ర్ మొద‌టి వారం నుండి మొదలు కానుండగా.. అప్పటి నుండే సాయిధరమ్ తేజ్ కూడా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది.