KGF2: కేజీయఫ్ చాప్టర్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంతంటే?
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కలిసి కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంతో గతవారం మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కేజీయఫ్ చాప్టర్ 1’కు సీక్వెల్‌గా వచ్చిన....

Kgf2 First Week Collections
KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కలిసి కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంతో గతవారం మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కేజీయఫ్ చాప్టర్ 1’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.
KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?
కేవలం కన్నడలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎక్కడ చూసినా కేజీయఫ్2 ఇదే జోరు చూపెట్టింది. దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా కొన్ని కొత్త రికార్డులను తన పేరిట రాసుకుంది. ఇక తొలి వారం ముగిసేసరికి ఈ సినిమా పాత రికార్డులను తొక్కుకుంటూ వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.719 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ సినిమా ఔరా అనిపించింది. పక్కా కమర్షియల్ మూవీగా వచ్చిన కేజీయఫ్2 చిత్రంలో హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకే చిత్ర యూనిట్ ప్రాధాన్యం ఇవ్వడం.. అది మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాకు వారు నీరాజనం పలికారు.
KGF2: సీరియల్ హీరోను.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీని కలిపిన ప్రశాంత్!
యశ్ సాలిడ్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్ కలగలిసి ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చిపెట్టాయి. ఇక ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ సినిమా ఏయే ప్రాంతంలో ఎంతమేర వసూళ్లు రాబట్టిందో చూద్దాం.
నైజాం – రూ.33.43 కోట్లు
సీడెడ్ – రూ.9.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.5.92 కోట్లు
ఈస్ట్ – రూ.4.40 కోట్లు
వెస్ట్ – రూ.2.73 కోట్లు
గుంటూరు – రూ.3.58 కోట్లు
కృష్ణా – రూ.3.23 కోట్లు
నెల్లూరు – రూ.2.15 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.64.51 కోట్లు(షేర్) (రూ.93 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.66.20 కోట్లు
తమిళనాడు – రూ.23.15కోట్లు
కేరళ – రూ.18.10 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా – రూ.128.60 కోట్లు
ఓవర్సీస్ – రూ.56.45 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.357.01 (షేర్) (రూ.719.30 కోట్లు గ్రాస్)