KGF2: సీరియల్ హీరోను.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీని కలిపిన ప్రశాంత్!

కేజీఎఫ్ విజయం వెనక టెక్నీషియన్స్ తో పాటు.. కెజిఎఫ్ సినిమా స్టార్ కాస్ట్ కూడా అంతే ఇంట్రస్టింగ్ పాయింట్. ప్రశాంత్ నీల్, హీరోయిన్ శ్రీనిధి కూడా అల్టిమేట్ యాక్టింగ్ తో..

KGF2: సీరియల్ హీరోను.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీని కలిపిన ప్రశాంత్!

Kgf2 (1)

KGF2: కేజీఎఫ్ విజయం వెనక టెక్నీషియన్స్ తో పాటు.. కెజిఎఫ్ సినిమా స్టార్ కాస్ట్ కూడా అంతే ఇంట్రస్టింగ్ పాయింట్. ప్రశాంత్ నీల్, హీరోయిన్ శ్రీనిధి కూడా అల్టిమేట్ యాక్టింగ్ తో అదరగొట్టినవాళ్లే..స్పెషల్లీ శ్రీనిధి.. కెజిఎఫ్ తో స్టార్ అయిపోందనుకున్నారు శ్రీనిధి. కానీ ఈ కన్నడ కస్తూరి అంతకుముందే ఇంటర్నేషనల్ లెవల్లో సెలబ్రిటీ అని మీకు తెలుసా..?

KGF2-Beast: రాఖీభాయ్ విజయం.. బీస్ట్ దర్శకుడిపై ఆగ్రహం!

రాకీ భాయ్ గా యష్ అంత రఫ్ గా విలన్లను చితక్కొడతాడు. గన్ పట్టుకుని అడ్డొచ్చినవాళ్లను పేల్చిపారేస్తాడు. ఇంత అగ్రెసివ్ యష్ లో కూడా ప్రేమ పుట్టించింది శ్రీనిధి. క్యారెక్టర్ లెన్త్ తక్కువైనా.. సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ గా శ్రీనిధి శెట్టి రియల్ స్టోరీ కూడాఇంట్రస్టింగే. శ్రీనిధి ఈ సినిమాతోనే స్టార్ అవ్వలేదు. అంతకటే ముందే ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్స్ లో ఇండియా సత్తాచాటింది ఈ క్యూట్ హీరోయిన్. 2016 లోనే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే కాంటెస్ట్ లో గెలిచి గ్లోబల్ వైడ్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

KGF2: ఓవర్సీస్‌లోనూ అదే జోరు.. ఏకంగా 3 మిలియన్‌లతో దుమ్ములేపేశారు!

రాకింగ్ స్టార్ యష్ గురించి, అతడి సక్సెస్ గురించి అందరికీ తెలిసిందే. సీరియల్స్ లో నటిస్తూ.. సినిమాల మీద ఇంట్రస్ట్ తో క్యారెక్టర్లుచేస్తూ వచ్చిన యష్.. కన్నడ సినిమాల్లో తన కంటూ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 8 ఏళ్ల క్రితం ప్రశాంత్ ఈ పవర్ ఫుల్ స్టోరీ చెప్పడంతో.. ఎలా అయినా కన్నడ సినిమాని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లాలని అప్పుడే డిసైడ్ అయిన యష్.. ప్రశాంత్ ని నమ్మి 8 ఏళ్లుగా కెజిఎఫ్ మీద వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే సినిమా చేసి 6 రోజుల్లోనే 600 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించారు యష్.

KGF2: 8 ఏళ్ళ ప్రయాణం.. రాఖీ భాయ్ రికార్డుల వెనక కష్టం తెలుసా?

నాట్ బట్ నాట్ లీస్ట్..కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంత పెద్ద సినిమా చెయ్యాలంటే.. ఈస్కేల్ లో సినిమాని తీసుకెళ్లాలంటే.. కనీసం 10 సినిమాల ఎక్స్ పీరియన్స్ అయినా ఉండాలంటారు జనాలు. కానీ ఒకే ఒక్క సినిమా చేసి కెజిఎఫ్ లాంటి పెద్ద సినిమా చేసే సాహసం చేశారు ప్రశాంత్ నీల్. ఉగ్రమ్ అనే చిన్న సినిమాతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత కెజిఎఫ్ కథమీదే కాన్సన్ ట్రేట్ చేశారు. 8 ఏళ్లుగా కథని డెవలప్ చేస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.