KGF2: ఓవర్సీస్‌లోనూ అదే జోరు.. ఏకంగా 3 మిలియన్‌లతో దుమ్ములేపేశారు!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఎలాంటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘కేజీయఫ్-1’కు..

KGF2: ఓవర్సీస్‌లోనూ అదే జోరు.. ఏకంగా 3 మిలియన్‌లతో దుమ్ములేపేశారు!

Kgf2 Crosses 3 Million Mark In Us

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఎలాంటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘కేజీయఫ్-1’కు సీక్వెల్ చిత్ర యూనిట్ తెరకెక్కిచడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పరుగులు తీసారు. అయితే ఈ సినిమాను కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంతో ఈ సినిమా అన్నింటా విజయఢంకా మోగిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

KGF2: చుక్కలు చూపిస్తున్న రాఖీభాయ్.. కొత్త సినిమాలు మళ్ళీ వాయిదా?

ఇకపోతే ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా పట్టం కడుతున్నారు. అక్కడ ఈ సినిమా దక్షిణాది భాషల్లో అదిరిపోయే క్రేజ్‌ను సాధించింది. ఈ సినిమాను చూసేందుకు ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు. కాగా యూఎస్‌లో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

KGF2: కేజీయఫ్ 2.. నైజాంలో మండే టెస్ట్ పాస్!

హీరో ఎలివేషన్స్, భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు కలిసి ఈ సినిమాకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ను తెచ్చిపెడుతున్నాయి. ఇక ఈ సినిమా ఇండియావైడ్‌గా కేవలం 5 రోజుల్లో ఏకంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా, బాలీవుడ్‌లో ఈ వారం ముగిసేరకి రూ.300 కోట్ల మార్క్‌ను అలవోకగా టచ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాల్లో టక్ బలంగా వినిపిస్తోంది. మరి కేజీయఫ్ చాప్టర్ 2 మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.