Minister Harish Rao : కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ.. కాన్సంట్రేషన్ తక్కువ : మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పాలన వద్దనే... కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా సాయం అందలేదని విమర్శించారు. తాము రైతు బంధు అందిస్తూ రైతులకు అదుకుంటున్నామని తెలిపారు.

Minister Harish Rao : కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ.. కాన్సంట్రేషన్ తక్కువ : మంత్రి హరీష్ రావు

Minister Harish Rao

Kishan Reddy Confusion : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ.. కాన్సంట్రేషన్ తక్కువ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఫ్రస్ట్రేషన్ తో పట్టపగలు పచ్చి అబద్దాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని వెల్లడించారు. అమిత్ షా గతంలో చెప్పిన అబద్ధాలనే కిషన్ రెడ్డి రిపీట్ చేశారని తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, ప్రజలకు బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాలను కూడా కిషన్ రెడ్డి కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి లేని గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి పవర్ యింట్ ప్రజెంటేషన్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు.

విభజన చట్టం హామీలు ఎందుకు నెరవేర్చరో కిషన్ రెడ్డి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వరని నిలదీశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. బీబీనగర్ ఎయిమ్స్ కు నామమాత్రంగా నిధులు విడుదల చేసి నత్త కూడా సిగ్గు పడేలా పనులు జరుగుతుంటే కిషన్ రెడ్డి కేంద్రం గొప్ప తనమని చెప్పుకుంటారా? అని ఎద్దేవా చేశారు. ఆయుష్మాన్ కింద ఇచ్చేది గోరంత.. ఆరోగ్య శ్రీ కింద తామిచ్చేది కొండంత అని పేర్కొన్నారు.

Revanth Reddy : కేసీఆర్ మోసాలకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి : రేవంత్ రెడ్డి

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసి.. రాసి అలసిపోయామని.. ముందు వాటిని కిషన్ రెడ్డి ఇప్పించాలన్నారు. అసెంబ్లీలో చెప్పాం.. అంతటా చెబుతున్నాం.. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది తప్ప జరిగింది ఏమీ లేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయల పరిహారాన్ని మూడేళ్ల నుంచి అడుగుతున్నా.. కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీ ఖాతాలో పొరపాటున జమ అయిన 495 కోట్ల రూపాయలను తొమ్మిదేళ్ల నుంచి అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు 24 వేల 205 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతీ ఆయోగ్ సూచించినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. బోరు బావుల మోటార్లకు విద్యుత్ మీటర్ల నిబంధనతో రాష్ట్రానికి 30 వేల కోట్ల రూపాయలు నష్టం చేశారని తెలిపారు. చంద్రబాబు, ఎన్టీఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నా బోరింగ్ లు కొట్టడం తప్పలేదని.. కేసీఆర్ ప్రభుత్వంలో ఆ బాధ లేదన్నారు. కేసీఆర్.. కరెంట్, సాగు నీళ్లకు ఇబ్బంది కలిగిస్తాలేరని చెప్పారు.

YS Sharmila : టీఎస్పీఎస్సీ.. కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ.. ఉద్యోగాలు అమ్ముకోవడమే తండ్రీకొడుకుల టార్గెట్ : వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పాలన వద్దనే… కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా సాయం అందలేదని విమర్శించారు. తాము రైతు బంధు అందిస్తూ రైతులకు అదుకుంటున్నామని తెలిపారు. “మనం పని కోసం పోయే పరిస్థితి నుంచి మన వద్దకు పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు” అని పేర్కొన్నారు. అస్సాంలో కరెంట్ ఇవ్వలేమని డబుల్ ఇంజిన్ సర్కార్లు చేతులెత్తేశాయని వెల్లడించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ లు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. నాలుగు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని పేర్కొన్నారు. షోలాపూర్, ఓరంగాబాద్ లో 8 రోజులకి ఒకసారి నీళ్లు వస్తాయని అక్కడి సర్పంచ్ చెప్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు భీమా మహారాష్ట్రలో ఉండదన్నారు. రూ.20కోట్లు బెజ్జంకి మండలానికి ప్యాకేజ్ ఇచ్చానని తెలిపారు. కరీంనగర్, సిద్దిపేటలో ఐటీ హబ్ లు వచ్చాయని తెలిపారు. పని చేసే వారిని గెలిపించండి అని పిలుపు ఇచ్చారు.