Krishna Vrinda Vihari: కృష్ణ విందా విహారి ఫస్ట్ లుక్.. నాగశౌర్య ఒడిలో షెర్లీ!

యువ నటుడు నాగశౌర్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే.. శౌర్య మాత్రం వరుస సినిమాలతో లక్ పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. నాగశౌర్య నటించిన తాజా..

Krishna Vrinda Vihari: కృష్ణ విందా విహారి ఫస్ట్ లుక్.. నాగశౌర్య ఒడిలో షెర్లీ!

Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari: యువ నటుడు నాగశౌర్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే.. శౌర్య మాత్రం వరుస సినిమాలతో లక్ పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. నాగశౌర్య నటించిన తాజా సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్​ ఆర్​.కృష్ణ దర్శకత్వం వహించగా.. షెర్లీ షెటియా కథానాయకిగా నటించింది. ఆమధ్య ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా టీజర్ అప్డేట్ ఇస్తూ ఇప్పుడు మరో పోస్టర్ వదిలింది యూనిట్.

Naga Shaurya : ‘కృష్ణ వ్రింద విహారి’ గా నాగ శౌర్య..

ఏప్రిల్​ 22న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న టీం మార్చి 28న టీజర్ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూనిట్ ఓ పోస్టర్ వదిలింది. ఈ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే శౌర్య-షెర్లీ రొమాంటిక్ పోస్టర్ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

ఇందులో నాగశౌర్య, షెర్లీ సెటియా రొమాంటిక్ పోజ్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూస్తే సినిమాలో వీరిద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నట్లు కనిపిస్తోంది. నాగశౌర్య ఒడిలో ఒదిగిపోయిన షెర్లీని చూస్తుంటే ఈ సినిమాలో వీరి రొమాన్స్ ఓ రేంజ్ లో ఉండనుందని అంచనా వేస్తున్నారు. రాధిక శరత్ కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మజీ, సత్య వంటి భారీ క్యాస్టింగ్ కూడా ఉండడంతో ఈ సినిమా అయినా శౌర్యకి మరోసారి మళ్ళీ కమ్ బ్యాక్ హిట్ ఇస్తుందని ఆశపడుతున్నారు.