KTR : భారత సినీ పరిశ్రమకి హైదరాబాద్‌ని హబ్‌గా చేస్తున్నాము.. మీ పేరు చెపితే అరుపులే..

తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ''ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటిదాకా ఓపికగా కూర్చున్న మా తమ్ముళ్లు అందరికి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నా సోదరుడు, మీ అభిమాన..

KTR : భారత సినీ పరిశ్రమకి హైదరాబాద్‌ని హబ్‌గా చేస్తున్నాము.. మీ పేరు చెపితే అరుపులే..

Ktr

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.

తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ”ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటిదాకా ఓపికగా కూర్చున్న మా తమ్ముళ్లు అందరికి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నా సోదరుడు, మీ అభిమాన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. ఇదే గ్రౌండ్ లో నాలుగేళ్ల క్రితం చరణ్ పిలిస్తే ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చాను. అప్పుడు మాట్లాడుతూ మీ పేరు రాగానే అరుపులే వినిపించాయి. ఇక్కడికి నేను ప్రభుత్వ మంత్రిగా రాలేదు. పవన్ సోదరుడిగా వచ్చాను. ఆయన చాలా మంచి మనిషి, మంచి మనుషున్న మనిషి. చాలా మంది స్టార్స్ ఉంటారు. కానీ ఇంతమంది అభిమానులు మీకు మాత్రమే. నా కాలేజీ రోజుల్లో తొలిప్రేమ చూశాము. అప్పట్నుంచి మిమ్మల్ని ఇలాగే చూస్తున్నాము. ఇప్పటికీ అదే స్టార్ డం. ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించడం అసాధ్యం. కానీ మీకు మాత్రమే అది సాధ్యమైంది. సినిమా టీం అందరికి ధన్యవాదాలు.” అని తెలిపారు.

Rana : పవన్ కళ్యాణ్ గారికంటే నేనే ముందు సెలెక్ట్ అయ్యాను ఈ సినిమాలో

తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ గురించి తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడుతూ.. ”శ్రీనివాస యాదవ్ గారు చెప్పింది నిజం. తెలుగు పరిశ్రమకే కాదు భారత సినీ పరిశ్రమకి కూడా హైదరాబాద్ ని కేంద్రంగా చేయాలని అనుకుంటున్నాము. దాని కోసం కష్టపడుతున్నాము కూడా. పవన్ లాంటి స్టార్స్ అంతా సపోర్ట్ చేస్తే కచ్చితంగా అది జరుగుతుంది. ఇవాళే మల్లన్న సాగర్ ప్రారంభించారు. ఇప్పుడు గోదావరి లాంటి ప్రదేశాలు తెలంగాణాలో కూడా ఉన్నాయి. షూటింగ్ లు మల్లన్న సాగర్ వద్ద, కొండా పోచమ్మ వద్ద కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా షూటింగ్స్ చేయండి. మొగిలయ్య లాంటి చాలా మంది కళాకారులని బయటకి తీసుకొచ్చినందుకు పవన్ గారికి శుభాకాంక్షలు.” అని చెప్పారు.