Rana : పవన్ కళ్యాణ్ గారికంటే నేనే ముందు సెలెక్ట్ అయ్యాను ఈ సినిమాలో

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ''ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు పంజా సినిమాకి రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కొని వచ్చాను. ఈ సినిమాతో చాలా మంది మేధావులని కలిసాను. యాక్టర్ అయి 12 ఏళ్ళు.....

Rana : పవన్ కళ్యాణ్ గారికంటే నేనే ముందు సెలెక్ట్ అయ్యాను ఈ సినిమాలో

Rana

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.

Sagar K Chandra : పంజా ఆడియో ఫంక్షన్ కి లోపలి కూడా వెళ్ళలేకపోయాను.. కాని ఇవాళ..

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ”ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు పంజా సినిమాకి రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కొని వచ్చాను. ఈ సినిమాతో చాలా మంది మేధావులని కలిసాను. యాక్టర్ అయి 12 ఏళ్ళు అయినా తెలుగు సినిమా హీరో ఎలా అవ్వాలో ఇంకా అర్ధం కాలేదు. నేను యాక్టర్ అయ్యాను కానీ హీరో అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించారు పవన్ కళ్యాణ్. ఇండియాలో చాలా మంది స్టార్ హీరోలతో చేశాను బట్ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్. పవన్ గారితో చేశాక ఇప్పట్నించీ నా సినిమాలు ఇంకోలా ఉంటాయి. త్రివిక్రమ్ గారు చాలా గ్రేట్. అనవసరంగా ఆయన సినిమాలలోకి వచ్చారు రాకపోతే రాకెట్లు ఎగరవేసేవారు, అంత మేధావి ఆయన. పవన్ కళ్యాణ్ గారికంటే నేనే ముందు సెలెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. సితార వాళ్ళు చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలో చాలా మంది ఫైన్ యాక్టర్స్ నటించారు. తెలంగాణ గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్. మీరు అనుకున్నట్టు హైదరాబాద్ ని భారత సినీ పరిశ్రమలో అగ్రగామిగా నిలబెడతాము తప్పకుండా.” అని అన్నారు.