మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపిస్తున్న NEW LOCKDOWN రూల్స్

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 09:29 AM IST
మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపిస్తున్న NEW LOCKDOWN రూల్స్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన లాక్‌డౌన్ రూల్స్ ప్రజలపై మానసికంగా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. దశల వారీగా పొడిగిస్తున్న లాక్ డౌన్ లాభమే తెచ్చిపెట్టిందా.. ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ కుంగదీసిందా ఓ సారి చూద్దాం. రోజువారీ ఎక్సర్‌సైజులు, నిత్యవసరాల కొనుగోళ్లకు మాత్రమే బయటకు అనుమతి ఉంది. మార్చి 23కు ముందు ఇలాంటి ప్రశాంత లేదా యుద్ధ వాతావరణం మనం చూసి ఉండం. 

న్యూ గైడెన్స్ లో కొన్ని సడలింపులు ఉన్నాయి. కొద్దిపాటి పేదరికం నుంచి బయటపడేలా నియమాలు రూపొందించారు. అవసరమైన మేర అవుట్ డోర్‌లో తిరిగే అవకాశం కల్పించారు. పబ్లిక్ ప్రదేశాల్లో కలిసే అవకాశం ఉన్నప్పటికీ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాత్రమే. లాక్‌డౌన్ ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన నినాదం స్టే హోం.. స్టే సేఫ్.. 

ఇవన్నీ మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. మనకు కావలసిన వాళ్లు, కలవాలనుకునే వాళ్లు బయటే ఉండిపోవడం ఒంటరితనాన్ని పెంచేలా చేశాయి. అంతకుముందు అస్సలు కనిపించకుండా ఉన్నదానికంటే బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ గళ్లలో నిలబడి ఉండటం కనీసం ముఖాలనైనా చూసుకునేలా చేసి ఒంటరితనాన్ని పోగొట్టింది. 

మన అనే వాళ్లను కలిసి మనో ధైర్యం పెరిగేలా చేసింది. ఇదిలా ఉంచితే ఎక్సర్‌సైజులు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ఆరోగ్యపరంగా ఎండార్ఫిన్లు రిలీజ్ అయి సంతోషంగా ఉండేందుకు కారణమైంది. ఫలితంగా ఉద్వేగం, ఒత్తిడి, మనో వేదనను దూరం చేశాయి. ఇంకా ఈ న్యూ గైడ్ లైన్స్ కొద్దిసేపు మాత్రమే బయటతిరిగే వారికి ఇది చాలా బెనిఫిట్. 

సంక్షోభంలో ఇరుక్కుపోయినప్పుడు ప్రజలంతా అధికారులను ప్రశ్నిస్తూ భవితవ్యంపై ఆశగా చూశారు. ఇప్పుడు అది మారింది రోజువారీ అవసరాలు తీరుతున్నాయి. ప్రజలు ముందు రిలీఫ్ ఫీల్ అయ్యారు. కరోనావైరస్ గురించి అంతగా తెలియకముందు ఎటువంటి సమాచారం లేనప్పుడు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేకపోవడంతో లాక్ డౌన్ పాటించడం సమస్యఅని భావించారు. 

క్రమంగా దాని ప్రాముఖ్యత తెలుసుకుని వ్యాధి తీవ్రత తెలియడంతో ప్రజల ఆలోచనలో మార్పులు వచ్చాయి. ప్రధాని స్థాయి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోలేని వారు బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చని సూచించారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు బదులుగా కార్లు, బైకులు వాడి పని ప్రాంతానికి వెళ్లాలంటూ సూచించారు. లాక్ డౌన్ తొలి రోజుల కంటే సడలిస్తూ వచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రజలను మానసికంగా మంచి మార్గంలోకే తీసుకొచ్చాయి. ఇంకా మరిన్ని నిషేదాలు తొలగించిన తర్వాత ప్రజలు యథాస్థితికి రావడం ఖాయం. 

Read More:

పురుషుల్లో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే!

* అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే?