అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే? 

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 06:56 AM IST
అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే? 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు తెలిపింది. అధిక బరువు కలిగినవారిలోనే కొవిడ్-19 ముప్పు అత్యధికంగా ఉంటుందని పేర్కొంది.

న్యూయార్క్ కు చెందిన రిపోర్టు ప్రకారం.. ప్రతి ఐదుగురిలో ఇద్దరిలో శ్వాసనాళాలకు సంబంధించిన సమస్యలు ఉంటున్నాయని తెలిపింది. ఫ్రాన్స్‌లో కరోనా సోకిన తక్కువ బరువు ఉన్నవారితో పోలిస్తే.. అధిక బరువు ఉన్నవారిలో దాదాపు 90శాతం మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరం తప్పక ఉంటుందని తెలిపింది. కరోనా సోకిన ఒబిసిటీ బాధితులు ఎక్కువగా ఇంటెన్సివ్ కేర్ (ICU) యూనిట్లోనే ఎందుకు చేరుతున్నారంటే అందుకు చాలా కారణాలుగా చెప్పవచ్చు. 

అవసరమైతే వీరికి ఇన్వేసివ్ వెంటిలేషన్ కూడా పెట్టాల్సి వస్తుందని రిపోర్టు వెల్లడించింది. ఛాతిలో అధిక స్థాయిలో కొవ్వు, పొట్టపై బెల్లీ ప్యాట్ కారణంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా అధిక స్థూలకాయం ఉన్నవారిలో శ్వాసపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో కొవిడ్-19 వ్యాధి సోకితే శ్వాసపరమైన సమస్యలతో శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని మరింత తగ్గిపోతుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. వీరికి అధికంగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. స్థూలకాయంతో బాధపడే కొందరి రోగుల్లో శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. 

శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందక శ్వాస రుగ్మతతో బాధపడుతుంటారు. ఈ కారణాలతో గుండె, ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ తగిన మోతాదులో సరిపోదు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. వీరిలో వ్యాధి తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించలేని విధంగా ఉంటుంది. కొవిడ్ సోకిన స్థూలకాయుల్లో తీవ్ర అనారోగ్యంతో పాటు మరణానికి దారితీసే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొవిడ్ కారణంగా ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒబెసిటీ ఉన్నవారిలో సాధారణంగా వ్యాధినిరోధక శక్తి కూడా తగినంత స్థాయిలో ఉండదు. రక్త సరఫరా కూడా అధిక స్థాయిలో ఉంటుంది. ఫలితంగా రక్తపోటు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

Read More:

కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు

*  కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 76శాతం తగ్గిన గుండెజబ్బులు