Lakhimpur Kheri Violence : తాను అక్కడ లేనన్న కేంద్రమంత్రి కుమారుడు..నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి

ఉత్తర ప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఆదివారం ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పై కారులో కేంద్రహోంమంత్రి కాన్వాయ్ లోని కార్లు దూసుకువెళ్లిన ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించిన విషయం

Lakhimpur Kheri Violence : తాను అక్కడ లేనన్న కేంద్రమంత్రి కుమారుడు..నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి

Ashish

Lakhimpur Kheri Violence ఉత్తర ప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఆదివారం ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పై కారులో కేంద్రహోంమంత్రి కాన్వాయ్ లోని కార్లు దూసుకువెళ్లిన ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. అయితే రైతుల మరణాలకు కారణమైన ఓ కారులో కేంద్ర హోంశాఖ స‌హాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండటం,ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. హత్య, అల్లర్లకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆశిష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ… అసలు ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని చెప్పారు. తాను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఉత్తరప్రదేశ్‌లోని బన్‌బీర్‌పూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నానని పేర్కొన్నాడు. తన కాన్వాయ్ ఘటన జరిగిన ప్రాంతం గుండా వెళ్తుండగా..తమను రైతులు అని చెప్పుకునే వ్యక్తులు తన డ్రైవర్ హరియోమ్ మిశ్రాపై రాళ్లు విసిరారని…హరియోమ్ మిశ్రా తలకి రాళ్లు తగలడంతో అతడు బ్యాలెన్స్ కోల్పోయి కారును ఒక మూలకి నడిపాడని..ఈ క్రమంలో రాళ్లు విసిరిన వ్యక్తులపై వాహనం దూసుకెళ్లిందని ఆశిష్ మిశ్రా చెప్పారు. ఈ ఘటనలో మరణించిన వారిలో నాన్‌పారాకు చెందిన రైతు నాయకుడు ఉన్నారని మిశ్రా చెప్పారు.

ఆ తర్వాత రైతులం అని చెప్పకునేవాళ్లు.. డ్రైవర్‌ హరియోమ్ మిశ్రాని కారు నుండి బయటకు తీసి కర్రలతో దారుణంగా కొట్టారు. తమ వ్యక్తులలో నలుగురైదుగురు మరణించారు, మరో ముగ్గురు మిస్ అయ్యారని ఆశిష్ మిశ్రా అన్నారు. తాను సంఘటన జరిగిన ప్రదేశంలో ఉంటే ఇప్పుడు మీ ముందు సురక్షితంగా నిలబడతానా అని ఆశిష్ మిశ్రా ప్రశ్నించారు. నా కారు కాలిపోయింది.. కానీ నాకు ఏమీ జరగలేదు.. అది ఎలా సాధ్యమవుతుంది అని ఆశిష్ మిశ్రా ప్రశ్నించారు.   తనపై కేసు నమోదుకావడం తప్పు అని, దర్యాప్తు జరిగితే వాస్తవం బయటికొస్తుందన్నారు. సంఘటన జరిగినపుడు తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో తెలిపే వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు.  న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.

మరోవైపు, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు తన కుమారుడు సిద్దమేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్​ మిశ్రా వెల్లడించారు. దర్యాప్తు చేసే వారు.. తమ ఫోన్​ రికార్డులు, మొబైల్​ ఫోన్​ లొకేషన్లు అన్ని చెక్​ చేసుకోవచ్చని.. అప్పుడు ఘటనాస్థలంలో తన కుమారుడు లేడన్న విషయం తెలిసి వస్తుందన్నారు. ఘటనాస్థలంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు ఎవరైనా ఒక్క ఆధారమైనా సమర్పిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మిశ్రా చెప్పారు.

హింసాత్మక ఘటనకు సంబంధించి తాజాగా బయటకొచ్చిన వీడియోపైనా మిశ్రా స్పందించారు. రైతులపైకి కారు నడిపిన వ్యక్తిని కొట్టి చంపేశారు. అంటే.. నా కుమారుడు నిజంగా అక్కడ ఉండి ఉంటే అదే జరిగేది కదా. కానీ అలా జరగలేదు అని తెలిపారు. ఘటనాస్థలంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు ఎవరైనా ఒక్క ఆధారమైనా సమర్పిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మిశ్రా చెప్పారు.

ఇక,లఖిమ్‌పూర్‌ లో రెండు రోజుల అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల మీద ట్రాఫిక్​ కనిపించింది. దుకాణాలు తెరుచుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు.కాగా.. ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ ఇంకా అమల్లో ఉంది. అంతర్జాల సేవలపై నిషేధం కొనసాగుతోంది.

ALSO READ రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్‌..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి