Life Insurance Corporation : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా ఎల్ఐసీ

ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్‌లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.

Life Insurance Corporation  : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా ఎల్ఐసీ

Life Insurance Corporation

LIC support to Odisha train accident victims : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు మద్దతుగా ఎల్ఐసీ కొన్ని సడలింపులను ప్రకటించింది. వారికి ఆర్థికంగా ఉపశమనం కలిగేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్ లను వేగవంతం చేస్తామని ప్రకటించింది.

AP Government: ఒడిశా దుర్ఘటనలో ఏపీ బాధితులకు పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 280 మందికి పైగా మరణించారు. 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ జీవిత బీమా కార్పోరేషన్ (LIC) బాధిత కుటుంబాలకు మద్దతునిస్తూ వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించడానికి సెటిల్మెంట్ క్లెయిమ్ లను వేగవంతం చేస్తామని ప్రకటించింది. LIC పాలసీలు మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క క్లెయింట్ల కష్టాలు తగ్గించడానికి LIC చైర్ పర్సన్ సిద్ధార్ధ మొహంతి అనేక రాయితీలను ప్రకటించారు.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్ కు బదులుగా రైల్వే అధికారులు లేదా పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన మరణాల జాబితా క్లెయిమ్ చేసుకోవడానికి రుజువుగా అంగీకరిస్తామని LIC ఒక ప్రకటనలో తెలిపింది. క్లెయిమ్ కి సంబంధించిన సందేహాల కోసం డివిజనల్ మరియు బ్రాంచ్ స్ధాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు LIC అధికారులు తెలిపారు.