AP Government: ఒడిశా దుర్ఘటనలో ఏపీ బాధితులకు పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందగా, పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

AP Government: ఒడిశా దుర్ఘటనలో ఏపీ బాధితులకు పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్

AP CM Jagan

Andhra Pradesh: ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు 294 మంది మరణించారు. మరో 1,175 మందికిపైగా గాయాలు కావడంతో వారికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. క్షతగాత్రుల్లో 100 మందికిపైగా క్రిటికల్ కేర్ వైద్యం అవసరం ఉందని, కొందరికి ఆపరేషన్ అవసరం ఉందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఇదిలాఉంటే .. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందగా, పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఒడిశా దుర్ఘటనలో బాధితులుగా ఉన్న ఏపీవారికి పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5లక్షలు, స్వల్పగా గాయపడితే రూ. లక్ష పరిహారం ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

Adhir Ranjan Chaudhary – Randeep Surjewala: ఆ పనేదో ముందే చేసిఉంటే ఇతంటి ఘోరం జరిగేది కాదు.. మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రశ్నలు

ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతానికి ఏపీకి చెందిన ఒకరు మృతి చెందారని, మృతున్ని సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తిగా గుర్తించడం జరిగిందని తెలిపారు. గురుమూర్తి కుటుంబానికి రూ. 10లక్షల పరిహారం అందిస్తామని అన్నారు. రెండు రైళ్లలో 695 మంది ఏపీ వాసులు ఉన్నారని, 553 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. 22 మందికి స్వల్ప గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 92 మంది తాము ట్రావెల్ చేయలేదని చెప్పారని, మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదని అన్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్లు గుర్తించి వారి ఇళ్లకు అధికారులను పంపించి వివరాలు తెలుసుకుంటున్నామని మంత్రి బొత్స తెలిపారు. రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.